స్టాప్ కౌంటింగ్ అంటూ ట్రంప్ ట్వీట్..

రిజల్ట్స్ ఆలస్యం అవుతున్న కొద్దీ డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం పెరిగిపోతోంది. పలురాష్ట్రాల్లో కౌంటింగ్‌తీరుపై ఇప్పటికే కోర్టులను ఆశ్రయించిన ట్రంప్.. తాజాగా స్టాప్ కౌంటింగ్ అంటూ ట్వీట్ చేశారు.పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లో కౌంటింగ్ తీరుపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఈ ప్రాంతాల్లో కౌంటింగ్‌ను వెంటనే ఆపాలని అక్కడి కోర్టుల్లో దావా వేశారు. అయితే జార్జియా, మిషిగన్, నెవాడా కోర్టులు ఇప్పటికే ట్రంప్ టీమ్ వాదనలను తోసిపుచ్చాయి. వాళ్లు వేసిన దావాలను కోర్టులు తిరస్కరించాయి. దీంతో ట్రంప్ తన ఆశలన్నీ సుప్రీం కోర్టుపైనే పెట్టుకున్నారు..పోస్టల్ బ్యాలెట్ ముగింపు తేదీపై సుప్రీంకోర్టులో ఇప్పటికే ఉన్న కేసులో తమను ప్రతివాదిగా చేర్చాలని కోరేందుకు ట్రంప్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది.
పెన్సిల్వేనియా, మిషిగన్‌లలో కౌంటింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తోన్న ట్రంప్ బృందం అక్కడి కోర్టుల్లో దావా వేసింది. కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ మరో దావా వేస్తామని తెలిపారు. విస్కాన్సిన్‌లోనూ రీ కౌంటింగ్ నిర్వహించాలని ట్రంప్ టీమ్ డిమాండ్ చేస్తోంది. అటు నెవాడాలోనూ కౌంటింగ్ జరిగే ప్రక్రియపై తీవ్ర నిరసన వ్యక్తంచేస్తోంది. ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడు ట్రంప్ వెనుకంజలో ఉన్నట్లు తేలడంతో ఆయన మద్దతుదారులు ఆందోళనకు గురవుతున్నారు. కౌంటింగ్ ప్రదేశాలకు చేరుకుని నిరసన తెలిపారు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.అయితే, ముందుజాగ్రత్తగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.
మిషిగన్, పెన్సిల్వేనియాల్లో కౌంటింగ్‌ను దాచిపెడుతున్నారని.. కౌంటింగ్ కేంద్రాల వద్ద రిపబ్లికన్ పర్యవేక్షకులను అనుమతించడం లేదని ట్రంప్ బృందం ఆరోపిస్తోంది. 25అడుగుల దూరంలో ఉండి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించవచ్చని నిబంధనల్లో ఉన్నప్పటికీ..దీనికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు రిపబ్లికన్లు గట్టిగా వాదిస్తున్నారు. బ్యాలెట్‌ను అనుమతించే కాలాన్ని పొడిగించడాన్ని ట్రంప్ టీమ్ వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా పెన్సిల్వేనియాలో మరో మూడు రోజులు పొడిగిస్తూ..నవంబర్ 12వరకూ బ్యాలెట్‌లను అనుమతించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది.ఎన్నికల తేదీ నాటికే పోస్టల్ బ్యాలెట్‌ను అనుమతించాలని, మొత్తం ప్రక్రియను ఎన్నికల రోజే పూర్తిచేయాలని ట్రంప్ బృందం మొదటినుంచి వాదిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com