ఎట్టకేలకు వైట్‌హౌస్ ను వీడిన ట్రంప్!

డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వైట్ హౌస్ ను వీడారు. జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే శ్వేతసౌధాన్ని వీడిన ట్రంప్ కుటుంబం.. వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాకు బయల్దేరింది. బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకోగా, అమెరికా ప్రజలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన పాలన చాలా అద్భుతంగా సాగిందని, కరోనా వచ్చిన 9 నెలల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందించామన్నారు ట్రంప్.
కాగా ట్రంప్ అధ్యక్షుడిగా చివరి రోజున శ్వేత సౌధం మాజీ ఉన్నతాధికారి స్టీవ్ బ్యానన్ సహా 73 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. మరో 70 మందికి శిక్షను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫ్లోరిడా బయలుదేరే క్రమంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏదో ఒక రూపంలో మళ్లీ తిరిగొస్తానని చెప్పారు. అనంతరం బైడెన్ పేరు ప్రస్తావించకుండా కొత్తగా ఏర్పడనున్న పాలకవర్గానికి ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com