TRUMP: నన్నే వెంటాడుతారా... మీ సంగతి చూస్తా

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తీవ్ర హెచ్చరికలు(warning) జారీ చేశారు. జడ్జీల నుంచి అధికారుల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు. తన వెంటాడుతున్న వారినీ తాను వెంటాడతానని తన సోషల్ మీడియో వేదిక ట్రూత్(truth) వేదికగా హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలని ప్రయత్నించి శాంతియుత అధికార మార్పిడికి అడ్డు తగిలారనే ఆరోపణల(criminal conspiracy )ను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్(trump)... తాజా హెచ్చరికలు ఆందోళనలు పెంచుతున్నాయి.
తనను వెంటాడి వేధిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాక్షులు, కోర్టుపరంగా సంబంధమున్న ఎవరినీ వదలబోనని(US prosecutors to judge) తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా న్యాయశాఖ ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్, మరి ఇద్దరు అటార్నీలపై బెదిరింపులతో కూడిన ప్రకటనను టీవీలో ప్రసారం చేయడానికి సన్నద్ధమయ్యారు.
తాజా హెచ్చరికలతో ట్రంప్‌ను అడ్డుకోవడానికి న్యాయశాఖ రంగంలోకి దిగింది. సాక్ష్యాధారాలను ట్రంప్ న్యాయ బృందం బయట పెట్టకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని జిల్లా జడ్జి టాన్యా చట్కన్(US District Judge Tanya Chutkan )ను కోరింది. అమెరికా పార్లమెంటు భవనంపై దాడి కేసులో నిందితులపై చట్కన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆమె బరాక్ ఒబామా హయాంలో నియమితులయ్యారు. ట్రంప్‌పై ఆరోపణల నిరూపణకు ప్రభుత్వం సమర్పిస్తున్న సాక్ష్యాధారాలను ఆయన వకీళ్లు, సాక్షులు, వారి వకీళ్లు, కోర్టు నియమించిన అధికారులకు తప్ప వేరెవరికీ చూపకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయాలని జడ్జి చట్కన్‌ను న్యాయశాఖ కోరింది.
ట్రంప్ ఓ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. తన మీద మరో కేసు నమోదైతే చాలు.. వచ్చే ఎన్నికలో గెలిచేది తానేనని ప్రకటించారు. వాళ్లు తన మీద కేసు పెట్టిన ప్రతిసారీ ప్రజాభిప్రాయ సేకరణలో తనకే మద్దతు పెరిగిపోతోందని చెప్పారు. తనపై కేసులు దాఖలు చేసిన ప్రభుత్వ న్యాయవాదులను బెదిరిస్తూ ట్రంప్ బృందం రూపొందించిన టీవీ వాణిజ్య ప్రకటన సోమవారం వాషింగ్టన్, న్యూయార్క్, అట్లాంటా నగరాలతోపాటు జాతీయ కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.
2020 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన అల్లర్ల కేసుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసుల్లో తాను నిర్దోషిని అని ఆయన కోర్టు తెలిపారు. కోర్టు విచారణ సమయంలో తన పేరు, వయసు ఆయన చెప్పుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో ఆయన కోర్టుకు హాజరుకావడం మూడోసారి ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వెనుక ఉన్న డోరు నుంచి ఆయన హాల్‌లోకి ఎంటర్ అయ్యారు. 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన కేసుల్లో ట్రంప్ విచారణ ఎదుర్కొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com