అంతర్జాతీయం

తాలిబన్ల దౌర్జన్యం.. న్యూస్ యాంకర్‌పైకి గన్ ఎక్కుపెట్టి..

అఫ్టానీయులారా భయపడవద్దు. తాలిబన్లు మిమ్మల్ని ఏమీ చేయరు. ఆఫ్ఘనిస్తాన్‌లో స్టూడియోలో సాయుధ వ్యక్తులు..

తాలిబన్ల దౌర్జన్యం.. న్యూస్ యాంకర్‌పైకి గన్ ఎక్కుపెట్టి..
X

అఫ్టానీయులారా భయపడవద్దు. తాలిబన్లు మిమ్మల్ని ఏమీ చేయరు. ఆఫ్ఘనిస్తాన్‌లో స్టూడియోలో సాయుధ వ్యక్తులు యాంకర్ వెనుక నిలబడి బలవంతంగా చెప్పిచ్చిన మాటలు ఇవి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ దృశ్యం తాలిబన్ల అరాచక పాలనకు అద్దం పడుతోంది.

ఆగస్టు 15 న ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి జర్నలిస్టులు టార్గెట్ చేయబడ్డారనే నివేదికలు వెలువడ్డాయి. దేశంలో పత్రికా కార్యకలాపాలు నిర్వహించడానికి తాము అనుమతిస్తామని తాలిబాన్లు చెప్పినప్పటికీ ఆచరణలో అది కనపడట్లేదనడానికి నిదర్శనం ఈ వీడియో. కొద్ది రోజుల క్రితం, టోలో న్యూస్‌లో పనిచేస్తున్న ఆఫ్ఘన్ రిపోర్టర్‌ని, ఒక కెమెరామెన్‌ని కాబూల్‌ నగరంలో రిపోర్ట్ చేస్తున్నప్పుడు తాలిబన్లు వారిని కొట్టారు.

నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని రాజధాని నగరం కాబూల్ మరియు జలాలాబాద్‌లో జర్నలిస్టులపై తాలిబన్ యోధులు దాడి చేసినట్లు నివేదికలు వెలువడ్డాయి. తాలిబన్ పోరాట యోధులు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి జర్నలిస్టులు, వారి బంధువుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. జర్మన్ మీడియా సంస్థ డ్యూయిష్ వెల్లే (DW) కోసం పనిచేస్తున్న రిపోర్టర్ యొక్క ఒక కుటుంబ సభ్యుడిని తాలిబన్లు కాల్చి చంపారు.

Next Story

RELATED STORIES