తానా బోర్డ్ చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి

ప్రతిష్టాకరమైన తానా బోర్డు కి జరిగిన ఎన్నికలలో డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా బోర్డ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కార్యదర్శి గా శ్రీమతి లక్ష్మి దేవినేని, కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జూనీ ) నిమ్మలపూడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రపంచ ప్రతిష్టాకరమైన టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పటిల్ లో పీడియాట్రిక్ కార్డియోవాస్క్యూలర్ అనేస్తేషలోజి లో డాక్టర్ శ్రీనివాస్ సేవలందిస్తున్నారు. బేలోర్ కాలేజీ అఫ్ మెడిసిన్ లో వైద్య విద్యని బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శి గా పనిచేసిన శ్రీనివాస్, బసవతారకం ప్రాజెక్ట్ కోటి రూపాయిల నిధిని సమకూర్చి, వైద్య పరికరాల కొనుగోలుకు తానా ఫౌండేషన్ తరుపున సహాయం అందించడంలో ముఖ్య భూమిక ఫోషించారు.
బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి లక్ష్మి దేవినేని గతంలో తానా బోర్డు కోశాధికారిగా, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ గా, విమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గానే కాకుండా ఇటీవలే జరిగిన 23 వ తానా మహా సభలలో పలు కమిటీలలో ఆమె సేవలందించారు. బోర్డు కోశాధికారిగా ఎన్నికైన జనార్దన్ నిమ్మలపూడి గారు గతంలో 21 వ తానా మహాసభల కార్యదర్శి గా , కాపిటల్ రీజియన్ కోఆర్డినేటర్ గానే కాకుండా కాన్సర్ అవగాహన, నిధుల సమీకరణం కోసం ప్రపంచ లో ఎత్తైన కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించారు.
.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com