Honey Trap: భారత సైటింటిస్ట్ ను ట్రాప్ చేసిన పాక్ మహిళ

Honey Trap:  భారత సైటింటిస్ట్ ను ట్రాప్ చేసిన పాక్ మహిళ
X
భారత క్షిపణి రహస్యాలు పాకిస్తాన్ చేరవేసిన డీఆర్డీఓ సైంటిస్ట్

పాకిస్తాన్ పన్నిన హనీ ట్రాప్ లో చిక్కుకున్న ఓ భారత్ కు శాస్త్రవేత్త పై మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. పూణే నగరంలోని డీఆర్ డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ కు చెందిన మహిళా గూఢాచారిణి జరా దాస్ గుప్తాకు భారత క్షిపణి వ్యవస్థల గురించి ఛాటింగులో వెల్లడించాడని ఏటీఎస్ ఛార్జి షీట్ లో పేర్కొంది.

పూణేలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ల్యాబ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు ప్రదీప్ కురుల్‌కర్. అతడు డిఫెన్స్‌కు సంబంధించిన రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్నారని, గూఢచర్యం చేస్తున్నాడన్న అనుమానంతో యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ అధికారిక రహస్యాలు చట్టం కింద మే 3వ తేదీన ప్రదీప్‌ను అరెస్టు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.



ఏటీఎస్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం.. ప్రదీప్ కురుల్‌కర్ తో యూ కేలో ఉంటున్న జారా దాస్ గుప్తా వాట్సాప్ ద్వారా తనను తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పరిచయం చేసుకుని చాటింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత తన అందంతో వల వేసింది. కొన్న అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లతో ప్రదీప్‌ను ఆకట్టుకుంది. విచారణ చేసే సమయంలో ఆ ఐపీ అడ్రస్‌ పాకిస్తాన్‌లో ఉన్నట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. కానీ ఇదంతా తెలియని ప్రదీప్ ఆమె మాయలో పడిపోయాడు. ఆమె అడిగింది కదా అని బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని మిసైల్ లాంచర్, మిలటరీ బ్రిడ్జింగ్ వ్యవస్థ గురించి ప్రదీప్ కురుల్‌కర్‌ మొత్తం వివరాలు చెప్పేసాడు. మగువ మైకంలో పడి అత్యంత రహస్యంగా ఉంచాల్సిన డీఆర్‌డీఓ సమాచారాన్ని తన ఫోన్‌లోకి వేసుకుని ఆ ఫోన్ నుంచి జారాకు షేర్‌ చేసినట్లు విచారణాధికారులు గుర్తించారు. వీరిద్దరూ గతేడాది జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు టచ్‌లో ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది.

శాస్త్రవేత్త ప్రదీప్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన తర్వాత డీఆర్ డీఓ అంతర్గత విచారణ ప్రారంభించింది. దీంతో ప్రదీప్ కురుల్కర్ ఫిబ్రవరి 2023 ఫిబ్రవరి నెలలో జారా నంబర్‌ను బ్లాక్ చేశాడు. వెంటనే మరొక ఇండియన్ నెంబర్ నుంచి నెంబర్‌ను ఎందుకు బ్లాక్ చేశావంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది.

మొత్తానికి డీఆర్ డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ పాక్ గూఢాచారిణి జరాతో వాట్సాప్, వాయిస్, వీడియో కాల్ ల ద్వారా మాట్లాడడని, క్షిపణి అధికారిక రహస్యాలను బయట పెట్టాడని ఏటీఎస్ వెల్లడించింది. ప్రదీప్ ను మహారాష్ట్ర ఏటీఎస్ మే 3వతేదీన గూఢచర్యం కేసులో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Tags

Next Story