Kim Jong un: రష్యా నుంచి కానుకలుగా డ్రోన్లు, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కోటు

Kim Jong un:  రష్యా నుంచి కానుకలుగా  డ్రోన్లు, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కోటు
రష్యా నుంచి నార్త్ కొరియాకు కిమ్​ తిరుగు ప్రయాణం..

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యా పర్యటన పూర్తియంది. ఆరు రోజుల పాటు రష్యాలో పర్యటించిన కిమ్​.. ఆదివారం రోజున తాను వచ్చిన రైలులోనే స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని ఆర్టెమ్‌ నగరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో రష్యా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. చేసే ప్రతిపనీ వింతగానే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఇతర దేశాలను భయపెడుతుంది. నియంతలా పాలిస్తున్న ఆయన కొవిడ్ విజృంభణ తగ్గిన తరువాత తొలి సారి విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే కిమ్ రష్యా పర్యటన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యం అమెరికా, వెస్ట్రన్ దేశాలకు కోపం తెప్పించింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కిమ్ తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా పర్యటన ముగించుకున్న అనంతరం ఆయనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలువైన బహుమతులు అందించారు. ఆ దేశ గవర్నర్ కిమ్ కి 5 పేలుడు డ్రోన్లు, 1 నిఘా డ్రోన్, బుల్లెట్ ప్రూఫ్ షర్ట్ను గిఫ్టులుగా అందించారు. వీటితో పాటు థర్మల్ కెమెరాల ద్వారా గుర్తించబడని ప్రత్యేక దుస్తుల్ని కూడా అందించినట్లు రష్యా మీడియా టాస్ తెలిపింది.


అయితే రష్యాతో ఆయన ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారనే వార్త చాలా దేశాలను భయపెట్టింది. రష్యా, ఉత్తర కొరియా నుంచి ఆర్టిలరీ షెల్స్, యాంటీ ట్యాంక్ క్షిపణులను కోరుకుంటోంది. బదులుగా రష్యా నుంచి శాటిలైట్, న్యూక్లియర్ సబ మెరైన్ టెక్నాలజీని నార్త్ కొరియా కోరుతోంది. శనివారం కిమ్ రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్ సోనిక్ క్షిపణులు, యుద్ధ నౌకలను పరశీలించారు.


ఆదివారం వ్లాడివోస్టాక్‌లో చదువుతున్న ఉత్తర కొరియా విద్యార్థులతో కిమ్ సమావేశమయ్యారు. అంతకుముందు వెస్ట్రన్ దేశాలకు పుతిన్ సాగిస్తున్న పోరుకు కిమ్ మద్దతు తెలిపారు. రష్యా, నార్త్ కొరియాల నడుమ స్నేహ పూరిత వాతావరణంలో చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ఒప్పందాలను ఇరు దేశాలు ప్రకటించకపోవడంతో ప్రపంచం ఊపిరిపీల్చుకుంది.



Tags

Next Story