తాగిన మైకం.. వాషింగ్ మెషీన్‌లో తల దూర్చి..

తాగిన మైకం.. వాషింగ్ మెషీన్‌లో తల దూర్చి..
వారంతా వాషింగ్ మెషిన్‌లో దిగి ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. కానీ రోల్ వంతు వచ్చేసరికి ఆమె అందులో ఇరుక్కుపోయింది.

చిన్న పిల్లలంటే తెలియక చేస్తారు. 21 ఏళ్లు వచ్చిన అమ్మాయి కూడా ఇలాంటి పనులు చేసిందంటే మద్యం మత్తులో అంతగా మునిగిపోయింది మరి. అప్పటి వరకు స్నేహితులంతా కబుర్లతో కాలక్షేపం చేసారు. పీకల దాకా మద్యం సేవించి ఓ ఛాలెంజ్ స్వీకరించారు. సరదాగా ఆడిన ఆట ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఈస్ట్ యార్క్‌షైర్‌లోని హల్‌కు చెందిన రోసీ కోల్ (21) తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వారంతా వాషింగ్ మెషిన్‌లో దిగి ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు.

కానీ రోల్ వంతు వచ్చేసరికి ఆమె అందులో ఇరుక్కుపోయింది. బయటకు రాలేక చాలా ఇబ్బంది పడింది. ఎంత ప్రయత్నించినా రాలేకపోతోంది. ఒకానొక దశలో నడుము క్రింది భాగం మరింత పట్టుకున్నట్లు అనిపించింది. దాంతో రోసీ ఆందోళన చెందింది. వెంటనే స్నేహితులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్లు వచ్చి ఆమెను పట్టుకుని నిదానంగా ముందుకు లాగారు. దీంతో ఆమె వాషింగ్ మెషీన్ నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంది.

Tags

Read MoreRead Less
Next Story