Dubai: ఎక్కడ ఎక్కారో... అక్కడే దిగారు...

దుబాయ్ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానానికి చేదు అనుభవం ఎదురైంది. సుమారు 13గంటలు ప్రయాణించి తిరిగి మళ్లీ దుబాయ్‌కి వచ్చేసింది. ఎక్కడి నుంచి టేకాఫ్ అయ్యిందో.. అక్కడే ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. న్యూజిలాండ్‌లో భీకర వర్షాలు పడుతున్నాయి. ఆక్లాండ్ విమానాశ్రయం వరదలతో నిండిపోయింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్ట్ పూర్తిగా మూసివేశారన్న సమాచారంతో పైలెట్ ఈకే 448 ఎమిరేట్స్ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. దీంతో దాదాపు సగం దూరం ప్రయాణించిన ఎమిరేట్స్ విమానం వెనుదిరగాల్సి వచ్చింది. దీనిపై ఆక్లాండ్ విమానాశ్రయ సిబ్బంది ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఈ పరిస్థితి తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. కానీ, ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం' అని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com