ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటెయిన్‌ దుబాయ్‌లో

ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటెయిన్‌ దుబాయ్‌లో
మానవ నిర్మిత ఫౌంటెయిన్లలో ఇదే అతి పెద్దది. పాం ఫౌంటెయిన్‌ సరికొత్త రికార్డులు సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్స్‌

కరోనా పాండమిక్‌ సిట్యుయేషన్‌లోనూ దుబాయ్‌ టూరిజం రంగంలో అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకుంది. పాం ఫౌంటెయిన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటెయిన్‌గా ఇది రికార్డులకెక్కింది. 14,366 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. మానవ నిర్మిత ఫౌంటెయిన్లలో ఇదే అతి పెద్దది. పాం ఫౌంటెయిన్‌ సరికొత్త రికార్డులు సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్స్‌ సీనియర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ షాడీ గాడ్‌ వెల్లడించారు.

దుబాయ్‌ ఆర్కిటెక్చరల్‌ అచీవ్‌మెంట్స్‌లో ఇదొక మైలు రాయి అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్‌‌గా బుర్జ్‌ ఖలీఫా సహా పలు అంశాల్లో ఇప్పటికే దుబాయ్‌ పలు రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొత్త ఫౌంటెయిన్‌లో 3,000కి పైగా ఎల్‌ఈడీ లైట్లు, 7,500 నాజిల్స్‌ వున్నాయి. 105 మీటర్ల వరకు నీటిని వెదజల్లేలా ఈ ఫౌంటెయిన్‌ని రూపొందించారు.

Tags

Read MoreRead Less
Next Story