Dubai Expo 2020: దుబాయ్ ఎక్స్‌పో స్పెషాలిటీ ఏంటి?

Dubai Expo 2020: కరోనా కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతీ పని అర్థాంతరంగా ఆగిపోయింది. కనీస సదుపాయలా దగ్గర నుండి చిన్న చిన్న సరదాల వరకు అన్నింటికి పాజ్ పడిపోయింది. అయితే కోవిడ్ 19 కారణంగా జరగని దుబాయ్ ఎక్స్‌పో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. గతేడాది జరగని కారణంగా ప్రస్తుతం ప్రారంభమయిన ఎక్స్‌పోకు దుబాయ్ ఎక్స్‌పో 2020 అనే పేరు పెట్టారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి 3000 మంది హాజరయ్యారు.
ఆండ్రియా బోసెల్లి, ఆండ్రా డే, ఎల్లీ గౌల్డింగ్, లాంగ్ లాంగ్, ఆంజెలిక్ కిడ్జో తదితర అంతర్జాతీయ సెలబ్రిటీలు ముఖ్య అతిధుల సమక్షంలో ప్రారంభ కార్యక్రమాలు జరిగాయి. యూఏఏ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇది 480 చోట్ల లైవ్ స్ట్రీమింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా అత్యద్భుతమైన రీతిలో ఫైర్ వర్క్స్ ప్రదర్శన వుంటుంది. ఆరు నెలలపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది.
25 మిలియన్ల మంది ఈ ఈవెంట్‌ని సందర్శించనున్నారు. 200 మంది పార్టిసిపెంట్స్ 192 దేశాల నుంచి ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. గంటకు 44,000 మంది ప్రయాణీకుల్ని ఈ ఈవెంట్‌కి తీసుకొచ్చేలా రవాణా సౌకర్యాలూ ఏర్పాటయ్యాయి. 200 డైనింగ్ స్పాట్స్, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అత్యద్భుతమైన రుచుల్ని అందించనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com