UAE: దుబాయ్ లాటరీ.. రూ.22 లక్షలు గెలుచుకున్న భారతీయుడు

UAE: దుబాయ్ లాటరీ.. రూ.22 లక్షలు గెలుచుకున్న భారతీయుడు
UAE: ఊరికే పైసలొస్తుంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. దుబాయ్ వెళ్లి రెండేళ్లైంది.

UAE: ఊరికే పైసలొస్తుంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. దుబాయ్ వెళ్లి రెండేళ్లైంది. అందరూ లాటరీ టికెట్లు కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అలాగే భారతీయ కార్యాలయంలో పని చేస్తున్న మహ్మద్ కూడా లాటరీ టికెట్ కొన్నాడు.

114వ సూపర్ సాటర్డే డ్రాలో 100,000 దిర్హామ్‌ల (రూ. 22,50,283) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు.

డ్రాలో విజేత మహ్మద్ హుజైఫా గూడినబలి— ఫిబ్రవరి 4, 2023 శనివారం జరిగిన వీక్లీ లైవ్ డ్రాలో గెలిచిన ఆరు నంబర్‌లలో ఐదింటిని సరిపోల్చిన తర్వాత బహుమతిని కైవసం చేసుకున్నారు. అనుకోకుండా అంత డబ్బు వచ్చే సరికి మహ్మద్ ఆనందం పట్టలేకపోతున్నాడు.

అసలే ఈ ఏడాది వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇల్లాలితో పాటు వచ్చిన డబ్బుతో ఇల్లు కూడా సమకూర్చుకోవాలనుకుంటున్నాడు. అన్నిటి కన్నా ముఖ్యంగా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాడు.. కష్టపడి పని చేయడంతో పాటు కాస్త లక్కు కూడా ఉంటేనే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని స్నేహితులు మహ్మద్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Tags

Next Story