Dubai Princess: విడాకుల తర్వాత కొత్త పెర్ఫ్యూమ్‌ను విడుదల చేసిన దుబాయ్ ప్రిన్సెస్
విడాకుల ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించిన దుబాయ్ యువరాణి తాజాగా మరో పోస్టు చేశారు. సొంత బ్రాండ్ కింద పెర్ఫ్యూమ్‌ను ఆవిష్కరించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పెర్ఫ్యూమ్‌కి ‘ డివోర్స్’ అని పేరు పెట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత, మోసం చేసిన వ్యక్తి చూస్తూనే ఉండేలా చేసే అనేక పనులు మీరు తరచుగా సినిమాల్లో చూసి ఉంటారు. దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె యువరాణి షేఖా మహరా కూడా తాజాగా అలాంటి పనే చేసింది. విడాకుల తర్వాత ఆమె ఒక పెర్ఫ్యూమ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దుబాయ్ ప్రిన్సెస్ పెర్ఫ్యూమ్ లాంచ్ చేయడం పెద్ద విషయం అయితే.. ఆ పెర్ఫ్యూమ్‌కి ‘డివోర్స్’ అని పేరు పెట్టడం ఇంకా విశేషం.
దుబాయ్ ప్రిన్సెస్ షేఖా మహ్రా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ‘డివోర్స్’ పెర్ఫ్యూమ్ చిత్రాన్ని పంచుకున్నారు. ఇందులో ‘డివోర్స్ బై మహర్ M1’ అని రాశారు కూడా. ఈ పోస్ట్ చూసిన తర్వాత ప్రజలు రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా స్వేచ్ఛ యొక్క సువాసన ఉంటుంది అని కొందరు కామెంట్ చేయగా.. ఎంత సృజనాత్మకత., ఈ పోస్ట్‌ని చూసి మీ మాజీ భర్తకు అసూయ కలిగి ఉంటుందని అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. మీరు చేస్తున్న పని సరైనదే. ఈ ప్రకటన చూసిన తర్వాత డివోర్స్ అనే పరిమళాన్ని ప్రయోగించి షేక్ మెహ్రా వేసిన బాణం సరైన లక్ష్యాన్ని చేధించేలా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇకపోతే ఇదివరకు షేఖా మెహ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె పోస్ట్‌లో ప్రియమైన భర్త.., మీరు మీ స్నేహితులు, ఇతర వ్యక్తులతో చాలా బిజీగా ఉన్నారు. ఈ కారణంగా నేను మీకు విడాకులు ఇస్తున్నాను.., జాగ్రత్తగా ఉండండి.. ఇటు మీ మాజీ భార్య అంటూ రాసుకొచ్చింది. ఇకపోతే., షేఖా మెహ్రా తన భర్త నుండి విడాకులు తీసుకున్నప్పుడు ఆమె వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆమె విడాకులు ఇచ్చే తీరు జనాలకు నచ్చింది. ఆ క్షణంలోనే ఆమె తన భర్తను కూడా అన్‌ఫాలో చేసింది. దీనితో పాటు, ఆమె తన భర్తతో ఉన్న అన్ని పోస్ట్‌లను కూడా తొలగించింది. అతనికి గతేడాదే పెళ్లయింది. వారిద్దరికీ ఓ కుమార్తె కూడా ఉంది. కానీ ఒక సంవత్సరం తర్వాత వారిద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com