Earthquake : పాకిస్థాన్ లో భూకంపం..

Earthquake : పాకిస్థాన్ లో భూకంపం..
ఇస్లామాబాద్ లో ఆదివారం మధ్యహ్నం 1.24 గంటలకు భూమి కంపించింది

పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్ లో ఆదివారం మధ్యహ్నం 1.24 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగలేదని అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్ కు పశ్చిమాన 37కిలోమీటర్ల దూరంలో భూప్రకంపణలు జరిగాయి. 10కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

జనవరి19, 2023న 5.6 తీవ్రతతో భూమి కంపించిన తర్వాత అంతటి భూప్రకంపణలు ఆదివారం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్, ఖైబర్-పఖ్తుంఖ్వాలోని పెషావర్, నౌషేరా, మర్దాన్, షబాఖాదర్, స్వాత్, కోహట్, స్వాబి, లోయర్ దిర్, బన్నూ, చర్సద్దా తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలిపారు. జనవరి 4 2023న పెషావర్, చర్సద్దా, ఖైబర్ - పఖ్తున్ఖ్వా పర్వత స్వాత్ లోయతో సహా వివిధ నగరాలలో భూప్రకంపనలు జరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story