Earthquake: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

Earthquake: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌
X
భూ విలయం సంభవించి రోజులు గడుస్తుండటంతో ఆచూకీ దొరకని వారి ప్రాణాలపై సన్నగిల్లుతున్న ఆశలు

టర్కీ - సిరియా దేశాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో ఇప్పటి వరకు 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 వేల మందికిపైగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూ విలయం సంభవించి రోజులు గడుస్తుండటంతో ఆచూకీ దొరకని వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

ఇరుదేశాలకు ఆపన్న హస్తం అందిస్తామని ప్రపంచ దేశాలు ముందుకువస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచుతో పాటు వరుసగా వస్తున్న ప్రకంపనలు సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు ముగిసిపోయాయి. ఎంతో మంది చిన్నారులు అయిన వారిని పోగొట్టుకొని అనాథలుగా మారిపోయారు.

Tags

Next Story