Earthquake : న్యూజీల్యాండ్ లో భూకంపం

Earthquake : న్యూజీల్యాండ్ లో భూకంపం
X
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది


న్యూజీలాండ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. యూరోపియన్ - మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, వెల్లింగ్టన్ సమీపంలోని లోయర్ హట్ కు 78 కిమీల దూరంలో భూకంపం సంభవించింది. ప్రకంపనలు 48కిమీల లోతులో సంభవించాయని ప్రభుత్వ భూకంప మానిటర్ జియోనెట్ పేర్కొంది. భూకంప కేంద్రం పట్టనానికి 50కిమీల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. టర్కీ - సిరియాలో సంభవించిన భూకంపం తర్వాత 10 రోజులకు న్యూజిల్యాండ్ లో భూప్రకంపనలు జరగడంతో ప్రజలు భయానికి లోనయ్యారు. టర్కీ- సిరియాలో ఇప్పటివరకు 41వేల మంది మరణించినట్లు తెలుస్తోంది.

Next Story