Earthquake: సిరియాలో 275 పునరావాస శిబిరాలు

Earthquake: సిరియాలో 275 పునరావాస శిబిరాలు
మృతుల సంఖ్య 7వేలకు పైగా చేరుకునే అవకాశం

ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపంలో సిరియా, టర్కీల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నివాసాలు కోల్పోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రెండు దేశాల్లనో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సిరియా ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన బాధితుల కోసం 275 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో నార్తెన్‌ ఎలప్పో ప్రావిన్స్‌లో ఈ శిభిరాలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే నార్త్‌వెస్టెర్న్‌ ప్రావిన్స్‌లోని లటాకియాలో 32, హమా ప్రావిన్స్‌లో 5, టార్టస్‌లో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కానీ భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతమైన ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో ఎన్ని శిభిరాలు ఏర్పాటు చేశారో చెప్పలేదని వార్తా సంస్థలు వెల్లడించాయి. మృతుల సంఖ్య 1441 కు చేరుకుందని గాయపడిన వారి సంఖ్య 2349 కు చేరుకుందని ఆదివారం సిరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా సిరియా మానవహక్కుల సంస్థ మాత్రం దాదాపు 5300 మందికి పైగా ప్రాణాలు విడిచారని, మృతుల సంఖ్య 7000లకు పైగా చేరుకునే అవకాశం ఉందని ఇంకా చాల మృత దేహాలు శిధిలాల కిందే ఉన్నాయని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story