Earthquake: పపువా న్యూగినియాలో భారీ భూకంపం..

పపువా న్యూగినియాలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదయ్యింది. అంబుటి ప్రాంతంలో భూ ప్రకంపనలు మొదలయ్యాయని.. దీని కేంద్రం 35 కిలోమీటర్ల లోతులో ఉన్నదని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
పపువా న్యూగినియాలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదయ్యింది. అంబుటి ప్రాంతంలో భూ ప్రకంపనలు మొదలయ్యాయని.. దీని కేంద్రం 35 కిలోమీటర్ల లోతులో ఉన్నదని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా కొంతమేరకు ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ విపత్తు కారణంగా ఎంత ప్రాణ నష్టం జరిగిందనే సమాచారం ఇంకా తెలియరాలేదు. పపువా న్యూగినియా ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి. సముద్రం లోపల అగ్ని పర్వతాలు బద్దలవుతుంటాయి. 1990 నుంచి పపువా న్యూగినియాలో 7.5, అంతకంటే ఎక్కువ తీవ్రతతో 22 భూకంపాలు వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్‌లోనూ 7.0 తీవ్రతతో ఇక్కడ శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com