Taiwan earthquake 2024: తైవాన్ భూకంపం
తైవాన్ లోని తైపీలో బుధవారం నాడు భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను కూడ అధికారులు జారీ చేశారు.తైవాన్ తో పాటు జపాన్ లోని పలు ప్రాంతాల్లో సునామీ ఏర్పడే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
తైవాన్ లో చోటు చేసుకున్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదైంది. తైవాన్ లోని హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని యునైటేడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు.
భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్ తూర్పు తీరంలోని హువాలియెన్ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక ఐదంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోవడం చిత్రాల్లో కనిపిస్తోంది. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జపాన్‌లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
మియాకోజిమా ద్వీపంతో పాటు జపాన్ లోని దీవుల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. సునామీ కారణంగా 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద.1999లో తైవాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2,400 మంది మరణించారు.భూకంపాల కారణంగా ప్రతి ఏటా జపాన్ లో 1500 మంది మరణిస్తున్నారు. ఒకినావా ద్వీప సమూహంలో మూడు మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జపాన్ హెచ్చరించింది. భూకంపం సంభవించిన 15 నిమిషాలకు భారీ అల యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. మియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com