Earthquake : టర్కీ, సిరియాలో భూకంపం.. 640 కు చేరిన మృతుల సంఖ్య

Earthquake : టర్కీ, సిరియాలో భూకంపం.. 640 కు చేరిన మృతుల సంఖ్య
Earthquake : రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సోమవారం సిరియా సరిహద్దుకు సమీపంలో సంభవించిన భూకంపం టర్కీ మరియు ఉత్తర సిరియాలోని భవనాలను నేలమట్టం చేయడంతో 640 మందికి పైగా మరణించారు.

Earthquake : రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సోమవారం సిరియా సరిహద్దుకు సమీపంలో సంభవించిన భూకంపం టర్కీ మరియు ఉత్తర సిరియాలోని భవనాలను నేలమట్టం చేయడంతో 640 మందికి పైగా మరణించారు.

సిరియా సరిహద్దుకు సమీపంలోని దక్షిణ టర్కీలో సోమవారం సంభవించిన 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన తరువాత టర్కీ మరియు సిరియాలో అపార ప్రాణ నష్టం జరిగింది. అనేక భవనాలు నేలకూలాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మలత్యా ప్రావిన్స్‌లో కనీసం 130 భవనాలు కూలిపోగా, దియార్‌బాకిర్‌లో 16 భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

భూకంప కేంద్రానికి వాయువ్యంగా 460 కిలోమీటర్ల దూరంలో ఉన్న టర్కీ రాజధాని అంకారాలో కూడా ప్రకంపనలు సంభవించాయి. భూకంపం నేపథ్యంలో, టర్కీ అధికారులు అంతర్జాతీయ సహాయం కోసం పిలుపునిచ్చారు.

భూకంపం సంభవించిన ప్రాంతాలకు వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపించామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ట్విట్టర్‌లో తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, టర్కీకి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తామని అన్నారు. "టర్కీలో భూకంపం కారణంగా ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం జరగడం బాధాకరం.

మృతుల కుటుంబాలకు సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. భారతదేశం టర్కీ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఈ విషాదాన్ని ఎదుర్కోవటానికి అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం అరుస్తూ పరుగులు తీస్తున్నారు. దెబ్బతిన్న ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story