Earthquake: జపాన్‌లో భూకంపం.. 6.2గా తీవ్రత నమోదు

Earthquake: జపాన్‌లో భూకంపం.. 6.2గా తీవ్రత నమోదు
X
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.34 గంటలకు ప్రకంపనలు

జపాన్‌లో భూకంపం సంభవించింది. క్యుషులో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం సాయంత్రం 7:34 గంటలకు 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇదిలా ఉంటే జపాన్ ప్రభుత్వం సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. పసిఫిక్ తీరంలో మెగా భూకంపం సంభవిస్తే… దేశం భారీగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది. ఇక సునామీలు సంభవిస్తే వందలాది భవనాలు కూలిపోయే అవకాశం ఉందని.. 3 లక్షల వరకు ప్రాణ నష్టం జరిగే ఛాన్సుందని నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు రాయిటర్స్ కథనం పేర్కొంది.

ఇదిలా ఉంటే గత నెలలో మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపాలు సంభవించాయి. భారీ భవంతులు నేలకూలిపోయాయి. ఇప్పటి వరకు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. వేలాది మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మయన్మార్‌లో శిథిలాల తొలగింపు కష్టంగా మారింది. తగినంత సిబ్బంది లేకపోవడంతో సహాయ చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి.

Tags

Next Story