akistan: పాకిస్తాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రత నమోదు..

akistan: పాకిస్తాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రత నమోదు..
X
గత నెలలో కూడా పాకిస్తాన్‌లో వరసగా భూకంపాలు

పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం ఫైజలాబాద్ డివిజన్‌లో 4.2 తీవ్రతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫైసలాబాద్ డివిజన్‌లోని ఝాంగ్ తహసీల్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది.ఈ భూకంపం 111 కిలోమీటర్ల లోతులో సంభవించింది. గత నెలలో కూడా పాకిస్తాన్‌లో వరసగా భూకంపాలు సంభవించాయి. మే నెలలో ఇది మూడో భూకంపం. తక్కువ తీవ్రతతో కావడంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు తప్పాయి. మే 12న, రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో భూకంపం బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెట్టాను కుదిపేసింది.

ప్రపంచంలో భూకంపాల ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో పాకిస్తాన్ ఒకటి. అనేక జియోలాజికల్ ఫాల్ట్ లైన్స్ వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. పాకిస్తాన్ భౌగోళికంగా యురేషియా,భారత టెక్టోనిక్ ప్లేట్‌లు ఉండే ప్రాంతంలో ఉంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, గిల్గిత్ బాల్టిస్తాన్, ఇరానియన్ పీఠభూమి యూరేషియన్ ప్లేట్ దక్షిణ అంచును ఉన్నాయి. సింధ్, పంజాబ్, పీఓకే ప్రాంతాలు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ వాయువ్య అంచున ఉన్నాయి.

Next Story