Earthquake: మెక్సికోలో భారీ భూకంపం

టర్కీని భూకంపం వణికించింది. బలికెసిర్ ప్రావిన్సులో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు 200 కిలోమీటర్ల దూరంలోని ఇస్తాంబుల్‌లోనూ భూమి కంపించింది. భూకంపం ధాటికి సిందిర్గి పట్టణంలో దాదాపు 16 భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని 29 మంది తీవ్రంగా గాయపడగా, ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. శిథిలాలను తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
టర్కీ తరుచూ భూకంపాల ప్రభావానికి గురవుతుంది. టర్కీలో 2023 ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం.. బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. 53 వేల మంది బలయ్యారు. పురాతన నగరం ఆంటియోక్ సర్వనాశనమైంది. గత నెల జులై మొదట్లో కూడా 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమయంలో ఒకరు మరణించగా, 69 మంది గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com