Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదు

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం బలమైన భూకంపం సంభవించడంతో పలు భవనాలు కూలిపోయాయి. ఒక మాల్ పైకప్పు కూలిపోవడంతో అందులోని కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఈ భూకంపం వల్ల మాల్ ఫాల్స్ సీలింగ్ కూలిపోవడంతో దంపతులు మృతి చెందారు. దక్షిణ ఫిలిప్పిన్స్ మిందానో ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జర్మనీ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని, భూకంప నష్టం గురించి తక్షణ నివేదికలు అందలేదని చెప్పింది.

ఈ భూకంపం వల్ల మరో 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్పారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న తీరప్రాంత పట్టణం గ్లాన్‌లోని మున్సిపల్ కార్యాలయ భవనం, వ్యాయామశాల దెబ్బతిన్నాయి. కొన్ని సెకన్ల పాటు భూకంపం కొనసాగిందని, అనంతర ప్రకంపనలు, నష్టం గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ సూచించింది. దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లెనీ అరనెగో మాట్లాడుతూ.. బలమైన భూకంపంతో గోడలు దెబ్బతిన్నాయని, డెస్క్‌లపై నుంచి కొన్ని కంప్యూటర్‌లు కింద పడిపోయాయనని అన్నారు. గోడలకు పగుళ్లు, కంప్యూటర్ల కిందపడటం వంటివి చోటుచేసుకున్నట్టు చెప్పారు.

ఇటీవల పలు దేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫిలిప్పీన్స్, అప్ఘానిస్థాన్, పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, టర్కీ ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. భూకంప కార్యకలాపాలకు అవకాశం ఉన్న పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ప్రదక్షిణ చేసే అగ్నిపర్వతాల బెల్ట్ ‘రింగ్ ఆఫ్ ఫైర్‌’పై ఫిలిప్పీన్స్ ఉంది.

Tags

Read MoreRead Less
Next Story