Earthquake: అలస్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం

Earthquake: అలస్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం
రిక్టర్ స్కేల్‍పై 7.2 తీవ్రత నమోదు

అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఆదివారం ఉదయం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4 పాయింట్లుగా రికార్డు అయింది. US జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం ఆదివారం 0648 GMT వద్ద శాండ్ పాయింట్ పట్టణానికి నైరుతి దిశలో 55 మైళ్ళు (89 కిలోమీటర్లు) 32.6 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

భూకంపం తరువాత అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు వెలువరించారు. అలస్కాలోని శాండ్‌పాయింట్‌కు 98 కిలోమీటర్ల దూరంలో 32.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ద్వీపకల్పం, అలూటియన్ దీవులు, కుక్ ఇన్‌లెట్ ప్రాంతాలలో ప్రకంపనలు అలస్కా భూకంప కేంద్రం సంభవించినట్లు వెల్లడించారు. ప్రాణ, ఆస్తినష్టం వివరాలు ఏమి వెలువడలేదు. మొదట్లో సునామీ హెచ్చరిక జారీ చేసిన తర్వాత, జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ హెచ్చరికను రద్దు చేస్తున్నట్లు ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రకటించారు.


అలస్కా, కుక్ ఇన్లెట్ ప్రాంతాలకు ఇటువంటి ముప్పేమీ లేదని భూకంప కేంద్రం తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి భూమి కంపించింది. ముందు దీని తీవ్రతను 7.7గా పేర్కొన్నారు. తరువాత దీనిని తగ్గించి చూపారు. అలాగే ముందు సునామీ హెచ్చరికలు జారీ చేసిఅలస్కా తీర ప్రాంతం వెంబడి ఉండే ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే సునామీ ఉండదని నిర్థారణ కావడంతో అంతా మళ్ళీ కాస్త ప్రశాంతంగా మారింది. అయినా కానీ సముద్ర ఉపరితలంలో స్వల్ప మార్పులు ఉంటాయని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లరాదని , ఎక్కడికక్కడ స్థానిక అత్యవసర విభాగం సన్నద్ధంగా ఉండాలని అధికారులు తెలిపారు.

మార్చి 1964లో, ఉత్తర అమెరికాలో నమోదైన అత్యంత బలమైన భూకంపం వల్ల అలాస్కా అతలాకుతలమైంది. దాని తీవ్రత 9.2 నమోదయ్యింది. అప్పుడు భూకంపం తదనంతర సునామీతో 250 మందికి పైగా మృతి చెందారు. భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఉత్తర అమెరికాలో ఇదే ఇప్పటివరకు పెద్ద భూకంపగా నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story