Earthquake : తైవాన్‌, మేఘాలయ‌లో భూకంపం

Earthquake : తైవాన్‌, మేఘాలయ‌లో  భూకంపం
రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదు

తైవాన్, మేఘాలయ ప్రాంతాల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాభా ఉన్న తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీపంలోని వాతావరణ బ్యూరో తెలిపింది. భూకంప కేంద్రం తైవాన్‌లోని టైటుంగ్ కౌంటీకి సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ బ్యూరో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని కౌంటీలో భూమి కంపించింది. తైవాన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షను సమీపంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే తైవాన్ రాజధాని తైపీలో మాత్రం భూకంపం రాలేదు. మేఘాలయ ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ రీజియన్ లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. శనివారం రాత్రి 7.25 గంటలకు అయిదు కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలోని వారు బయట రోడ్లపైకి పరుగులు తీశారు.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుస భూకంపాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. భారత్, నేపాల్, మలేషియా, చైనా, పాకిస్థాన్, జపాన్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో వరుసగా భూపంకాలు సంభవిస్తున్నాయి. ఈ మద్యనే వాయువ్య చైనాలోని గాన్సూ క్విన్ ఘాయ్ లో భారీభూపంకం సంభవించింది.. రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదు అయ్యింది. ఈ ఘటనలో 116 మంది కన్నుమూసినట్లు సమాచారం. తాజాగా తైవాన్, మేఘాలయలో భూకంపం సంభవించింది.


భారత్ లో తరుచూ భూపంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఉదయం భూకంపం తీవ్ర ఆందోళన కలిగించింది. తైవాన్, మేఘాలయల ప్రాంతాల్లో భూమి కంపించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాబా ఉండే తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కౌంటీలోని గ్రామీణ ప్రాంతాల్లోని తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు.

తైవాన్ రాజధాని తైపీలో మాత్రం ఎలాంటి భూకంపం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే శనివారం మేఘాలయ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఇక్కడ వెస్ట్ గారోహిల్స్ రీజియన్ లో ఒక్కసారే భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.. వెంటనే ఇళ్లు వదిలి బయటకు వచ్చారు. రిక్టర్ స్కేల్ పై 3.5 గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.



Tags

Read MoreRead Less
Next Story