Ecuador: ఈక్వెడార్ దేశాధ్యక్ష అభ్యర్ధి కాల్చివేత

ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి ఫెర్నాండో విలా-విసెన్సియో దారుణ హత్యకు గురయ్యారు. క్విటోలోని ఓ పాఠశాలలో రాజకీయ ర్యాలీలో పాల్గొన్న 59ఏళ్ల "విలా-విసెన్సియా"ను ఓ సాయుధ దుండగుడు కాల్చి చంపాడు. ఆయన శరీరంపై అనేక రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు భద్రత కల్పిస్తున్న మరో పోలీసుకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. దుండగుడు ముందుగా ఒక గ్రనైడ్ ను విలా-విసెన్సియా వైపు విసరగా...అది పేలలేదు. వెంటనే అతడు కాల్పులకు తెగబడ్డాడు. ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికలకు మరో 2 వారాలే ఉన్న క్రమంలో ఫెర్నాండో హత్య...తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఈక్వెడార్ జాతీయ అసెంబ్లీ రద్దు కాకముందు ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఆగస్టు 20న జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో ఆయన కీలకంగా ఉన్నారు. ఈక్వెడార్ లో డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి నేరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని నిర్మూలిస్తానని "విలా-విసెన్సియో" ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్య జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com