Bird Flu Outbreak In US: అగ్రరాజ్యం అమెరికాను సైతం భయపెడుతున్న బర్డ్ ఫ్లూ..

బర్డ్ ప్లూ భారతదేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికానూ సైతం భయపెడుతుంది. ఒకవైపు, బర్డ్ ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్, గుడ్లు తినాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీంతో చికెన్, గుడ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అలాగే, అమెరికాలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో కోడిగుడ్ల ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. యూఎస్ లో గుడ్లను ప్రోటీన్లు అందించే ఆహారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్ పెరిగింది.
ఇక, బర్డ్‌ఫ్లూ దెబ్బకి గుడ్లు పెట్టే కోళ్లు క్రమంగా చనిపోతుండడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ కారణంతో గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోవడంతో.. దాని ప్రభావం కోడి గుడ్ల ధరలపై పడింది అన్నమాట. తాజా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ఏకంగా 10 డాలర్లు (రూ.867)కు చేరిందంటే ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే, గత ఏడాది జనవరి నుంచి యూఎస్ లో కోడి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు డజను గుడ్ల ధర ఏకంగా 65 శాతం మేర పెరిగిందని చెప్పొచ్చు. గుడ్ల ఉత్పత్తి రోజు రోజుకి పడిపోవడంతో కొన్ని సూపర్ మార్కెట్లలో కస్టమర్‌లకు అమ్మే గుడ్లపై ఆంక్షలు విధిస్తున్నారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కోళ్లకు వేగంగా సోకుతుంది. దీన్ని నివారించడానికి లక్షల్లో కోళ్లను అధికారులు చంపేస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఫామ్‌లలో పెరిగే కోళ్ల మీద కంటే దేశీయంగా పెరిగే నాటు కోళ్లపై ఎక్కువగా ఉంటుందని వైద్యు నిపుణులు తేల్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com