Lisbon: పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ఎలక్ట్రిక్ స్ట్రీట్‌కార్ ప్రమాదం

పోర్చుగల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లిస్బన్‌లో ఘోర స్ట్రీట్‌కార్ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్ట్రీట్‌కార్ అనబడిన ఐకానిక్ గ్లోరియా ఫ్యూనిక్యులర్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడినలో వారిలో పలువురు చిన్నారులు, విదేశీయులు ఉన్నారు. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ సర్వీసు బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
మొత్తం 43 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తోంది. రద్దీ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమాదంలో ఫ్యూనిక్యులర్ పూర్తిగా ధ్వంసమైంది. లిస్బన్ చరిత్రలో ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోర్చుగల్ పర్యాటక రంగానికి ప్రసిద్ధి. అనేక దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నిత్యం టూరిస్టులతో రద్దీగా ఉంటుంది. 1985లో ఈ గ్లోరియా ఫ్యూనిక్యులర్ ప్రారంభించబడింది. లిస్బన్ డౌన్‌టౌన్‌లోని ప్రాకా డోస్ రెస్టారెంట్లను, బైర్రో ఆల్టో జిల్లాకు కలుపుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com