Elisabeth Borne : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్

Elisabeth Borne : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ నియమితులయ్యారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ ఎలిజబెత్ బోర్న్ కావడం విశేషం. 61 ఏళ్ల ఎలిజబెత్ బోర్న్ గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నారు. అంతకుముందు 2018లో, ఆమె రవాణా మంత్రిగా పనిచేశారు. అధ్యక్షునిగా మోక్రాన్ ఇటీవల్ రెండోసారి ఎన్నిక కావడంతో ప్రధాని జీన్ కాస్టెక్స్ తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన మోక్రాన్, ఆయన స్ధానంలో ఎలిజబెత్ బోర్న్‌ను ప్రధానిగా నియమించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రభుత్వానికి చెందిన ఆర్‌ఏటీపీ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. 2017లో మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ పార్టీలో చేరారు. ఫ్రాన్స్‌లో అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయ్యేలోపు ప్రధానులు మారుతూనే ఉంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com