Elon Musk: నిద్ర కరువైందట పాపం....

Elon Musk: నిద్ర కరువైందట పాపం....
నిద్రలేకుండా పనిచేస్తోన్న ఎలాన్ మస్క్; ఐదు సంస్థల యజమానిగా ఉరుకులు పరుగులు...

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు నిద్ర కరువైందట. ట్విట్టర్ తో పాటూ తన ఆధీనంలో ఉన్న 5 సంస్థల బాగోగులు చూసుకునేందుకు అతడికి సమయమే సరిపోవడం లేదంట. ఈ మేరకు ట్వీట్ చేసిన మస్క్.. రోజంతా పని చేసి, ఇంటికి వెళ్లి వర్క్ స్టిమ్యులేటర్(మరింత ఎక్కవ పనిచేసేందుకు ప్రేరేపించే సాధనం)ను ప్లే చేసుకుంటున్నట్లు తెలిపాడు. ట్విట్టర్, స్పేస్ ఎక్స్, టెస్లా, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింగ్ సంస్థల బాగోగులు అన్నీ తానే అయ్యి దగ్గరుండి చూసుకుంటున్నాడు మస్క్. అయితే ప్రస్తుతం అతడి దృష్టి అంతా ట్విట్టర్ పైనేనని ప్రత్యేకించి చెప్పుకోవాల్సి అవసరంలేదు. ప్రస్తుతం విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను తిరిగి గాడిన పడేసి లాభాల్లోకి మళ్లించే దిశగా అహర్నిశలూ కృషి చేస్తున్నాడు. ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న దగ్గర నుంచి సంస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాడు. ఉమ్మడిగా ఉద్యోగల కోత ద్వారా 50శాతం మంది ఉద్యోగలకు ఉద్వాసన ఇచ్చేసిన తరువాత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 2500మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ కోతలు కేవలం అమెరికాకు మాత్రమే కాదు. బారత్ సహా ఎన్నో దేశాలను కుదిపేసింది. ట్విట్టర్ భారత సంస్థలో సుమారు 170మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 80కి పడిపోయింది. ఇతర టెక్ కంపెనీలు మాదిరే ముందస్థు నోటీస్ లేకుండా ఉద్యోగులకు ఉద్వాసన ఇచ్చేసింది. ఇతర సంస్థలతో పోల్చుకుంటే ట్విట్టర్ ఉద్యోగాల కోత మరింత రచ్చ అయింది. మరికొంత మంది ఉద్యోగులు సంస్థలోని క్లిష్టమైన వాతావరణంలో పనిచేయలేక స్వచ్ఛంధంగా రాజీనామా ఇచ్చేశారు. ఇక పాత ఉద్యోగులను పంపించేశాక మిగిలిన వారితో కలసి ట్విట్టర్ ను పునర్నిర్మించేందుకు 24గం.లు పనిచేస్తూనే ఉన్నాడు. తనతో పాటూ ఇతర ఉద్యోగులను సైతం రాత్రిపగలు అన్న తేడా లేకుండా పనిచేయిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా కోడింగ్ తెలిసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుకు రక్తకన్నీరే అనడంలో సందేహమేలేదు. వీరి కోసం ఆఫీస్ లోనే ప్రత్యేకమైన విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో బెడ్, సోఫా, ప్యూరిపైయర్ తో పాటూ అవసరానికి అన్ని ఏర్పాట్లు కలిగి ఉన్నాయి. మరోవైపు ఖర్చులు గణనీయంగా తగ్గించుకునే క్రమంలో ఆఫీసుల్లోని ఫర్నీచర్, వంటింటి సామాగ్రిని అమ్మకానికి పెట్టాడు. అంతేకాదు ఉద్యోగులకు తమ టిష్యూ పేపర్లను కూడా వారినే తెెచ్చుకోమన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story