Elon Musk : ఈవీఎంలపై ఎలన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు..

Elon Musk : ఈవీఎంలపై ఎలన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు..
X
బ్యాలెట్‌ పేపరే బెటర్‌ అన్న ఎలాన్‌ మస్క్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ టెస్లా అధినేత, ఎలాన్‌ మస్క్‌ ‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల’(ఈవీఎం)పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ఎన్నికలను ‘రిగ్గింగ్‌’ (ఫలితాన్ని ప్రభావితం) చేస్తున్నాయని, కృత్రిమ మేధ పరిజ్ఞానంతో ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చునని అన్నారు. బ్యాలెట్‌ పేపర్‌తో నిర్వహించటాన్ని, చేత్తో ఓట్ల లెక్కింపు ఎన్నికలను ఎలాన్‌ మస్క్‌ సమర్థించారు. పెన్సిల్వేనియాలో ఓ ప్రచార సభలో మస్క్‌ ప్రసంగిస్తూ, ‘నేను ఓ టెక్నాలజిస్ట్‌ను. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ను చాలా సులభంగా హ్యాక్‌ చేయవచ్చు’ అని అన్నారు. ఎన్నికల్లో ‘డొమినియన్‌’ కంపెనీ ఈవీఎంల వాడకాన్ని మస్క్‌ వ్యతిరేకించారు. దేశమంతా బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికల్ని నిర్వహించాలని అన్నారు.

డొమినియన్ ఓటింగ్ యంత్రాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ యంత్రాలను ఫిలడెల్ఫియా, మారికోపా కౌంటీలలో ఉపయోగిస్తున్నారని, అయితే చాలా ఇతర ప్రదేశాలలో ఉపయోగించలేదని ఆయన చెప్పారు. ఇది యాదృచ్చికంగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను మాత్రమే ఉపయోగించాలని, వాటిని చేతితో లెక్కించాలని కోరారు. “నేను సాంకేతిక నిపుణుడిని. నాకు కంప్యూటర్ల గురించి బాగా తెలుసు. నేను కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను విశ్వసించనను. ఎందుకంటే దానిని హ్యాక్ చేయడం చాలా సులభం. పేపర్ బ్యాలెట్ విషయంలో ఆ అవకాశం లేదు. ప్రజాస్వామ్య దేశాలలో పేపర్ బ్యాలెట్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి” అని మస్క్ అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ సారి ఎన్నికల్లో ఎలన్ మస్క్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుదారుగా నిలిచారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ట్రంప్ రాజకీయ కార్యాచరణ కమిటీకి 75 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.


Tags

Next Story