Elon Musk: ఫోన్ నంబర్ లేకుండానే..ఆడియో, వీడియో కాల్స్

Elon Musk: ఫోన్ నంబర్ లేకుండానే..ఆడియో, వీడియో కాల్స్
ఎక్స్(ట్విటర్)లో సరికొత్త ఫీచర్

'ఎక్స్'గా పేరు మార్చుకున్న ట్విటర్‌లో సరికొత్త ఆప్షన్ వస్తోంది. ఇందులో త్వరలో ఆడియో అండ్ వీడియో కాల్స్ సదుపాయం లభిస్తుందని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనికి సంబంధించిన అప్డేట్ ను తన అధికారిక ఎక్స్ అకౌంట్ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్ చేశారు. ట్విటర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత చేస్తున్న మార్పులు అన్నీ, ఇన్నీ కావు. ఉద్యోగుల తొలగింపు, బ్రాండ్ లోగోలో మార్పు వంటి వాటితో పాటు, ఇటీవల ట్విటర్‌కి 'ఎక్స్' అని పేరు కూడా మార్చేశాడు. కాగా ఇప్పుడు ఆడియో అండ్ వీడియో కాల్స్‌కి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.

ఇందులో ఇతరులకు ఆడియో గానీ లేదా వీడియో కాల్స్ గానీ చేయడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్ అవసరం లేదు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై అకౌంట్ ఉంటే సరిపోతుంది. తమ అకౌంట్‌ను ఓపెన్ చేసి, అందులో కొత్తగా చేర్చబోయే ఆడియో కాలింగ్, లేదా వీడియో కాలింగ్ ఆప్షన్ క్లిక్‌ చేయడం ద్వారా చక్కగా ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, మాక్, పీసీలో వినియోగించుకోవచ్చు. ఇది కార్పొరేట్ సెగ్మెంట్‌లో ఒక కొత్త పోటీకి తెరతీసింది. నిజానికి ఇలాంటి వెసలుబాటు వాట్సప్‌లో అందుబాటులో ఉంది. కానీ దానికి ఫోన్ నెంబర్ అవసరమౌతుంది.


అసలు ఎలోన్ మస్క్ Xని వినియోగదారుల కోసం ఒక సింగిల్ స్టాప్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చడానికి తన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అభిప్రాయాలు చెప్పటం, వీడియోలు పంచుకోవడంతో పాటు, చెల్లింపులు, డబ్బులు దాచుకోవటం కూడా జరిగేలా చూసే ఆలోచన ఉందని మస్క్ ఇంతకు ముందే ప్రకటించారు. వీటితోపాటు ఇకపై ఎక్స్ లో హైరింగ్ అనే ఆప్షన్ను కూడా పరిచయం చేసింది. ఈ ఫీచర్ లింక్డ్‌ఇన్‌ను పోలి ఉంటుంది.

ఇక ఇటీవలే ఎలాన్ మస్క్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌ను నెలకొల్పారు. దీని పేరు ఎక్స్ఏఐ. టాప్ సెర్చింజిన్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్.. వంటి సంస్థల్లో పని చేసిన కొందరు మాజీ ఉద్యోగులతో కలిసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు.bఈ స్టార్టప్ ద్వారా ఈ కాల్స్ సౌకర్యం అందుబాటులోకి తెస్తారని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story