Twitter : యూజర్లకు షాక్ ఇచ్చిన మస్క్

ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసిన దగ్గర నుంచీ దానిని ఎప్పటికి అప్పుడు మారుస్తూనే ఉన్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చడం, లోగోను మార్చడం లాంటి చాలా మార్పులే చేశారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారు ఎలాన్ మస్క్. ఎక్స్ ద్వారా ఆదాయం సంపాదించుకోవడానికి కొత్త ప్లాన్ వేశారు. దీని ప్రకారం ఇక మీదట ఎక్స్ వాడాలంటే ప్రతీ యూజర్ కొంత డబ్బులు చెల్లించాలి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చల సందర్భంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
తన సంస్థ ఆదాయంపెంచుకోవడానికి మస్క్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితం కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్‌ప్రధాని బెంజమిన్ నేతన్యాహూతో మస్క్ తాజాగా చర్చలు జరిపారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇద్దరూ పలు కీలక విషయాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్‌తో ఇజ్రాయిల్ ప్రధాని మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా వేదికల్లో ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం బాట్స్. వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. దీనిపై స్పందించిన ట్విట్టర్ బాస్.. ‘మేము కూడా ఆ దిశగా కృషి చేస్తున్నాము.అందులో భాగంగా త్వరలో ఎక్స్ ఖాతాదారులకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు విధించాలన్న యోచనలో ఉన్నాము. ఈ విధానం వల్ల బాట్‌లు ఉపయోగించి ఖాతాలు సృష్టించడం చాలా కష్టతరమవుతుంది’ అని మస్క్ పేర్కొన్నారు.
మస్క్.. ఇప్పటికే బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సేవను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధికారిక, ధృవీకరణ ట్విట్టర్ అకౌంట్లకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్‌కు చందా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు, త్వరలోనే ట్విట్టర్ ఖాతాదారులందరి నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజు వసూలు చేయాలనే ప్రదిపాదనలో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఎంత ఫీజు వసూలు చేస్తారన్న దానిపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.
అయితే డబ్బులుచెల్లించమనడం వెనుక ఓ కారణముందంటున్నారు మస్క్. ఎక్స్ లో వస్తున్న బాట్స్ ను తొలిగించేందుకు ఇదే సరైన పద్ధతని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్స్ లో నెలకు 550 మిలియన్ యూజర్లు ఉంటున్నారని…రోజుకు కనీస్ 100 నుంచి 200 మిలియన్ పోస్ట్ లు ఉంటున్నాయని తెలిపారు. అందులో బాట్స్ కూడా ఉంటాఉన్నాయని అన్నారు. ఇవి పోవాలంటే చాలా కొద్దిగా అయినా ఫీజు చెల్లించాల్సిందేనని వివరించారు. అయితే డబ్బులు చెల్లింపు విషయం మీద ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com