అపర కుభేరుడు ఎలన్ మస్క్ సోదరి కష్టాలు..
ట్విట్టర్ అధినేత అంటే తొందరగా గుర్తుకు రాకపోవచ్చు. కానీ టెస్లా కార్లు అంటే మొదటగా గుర్తొచ్చేది మాత్రం అతడే. తనే ట్విట్టర్ అధినేత, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా మోటార్స్ ఓనర్ ఎలన్ మస్క్. ప్రస్తుత కాలంలో మస్క్ పేరు వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో..! ఎలన్ మస్క్ స్పేస్-ఎక్స్ అనే సంస్థ ద్వారా నింగిలోకి ఉపగ్రహాల్ని కూడా పంపిస్తుంటారు. ప్రముఖ పేమెంట్స్ గేట్‌వే పేపాల్ సహవ్యవస్థాపకుడు కూడా.
అపర కుబేరుడికి రక్తసంబంధీకులు, స్నేహితులు అయినందున వారందరికీ మస్క్ ఏదో విధంగా సాయం చేస్తాడనే అంతా అనుకుంటారు. ఈ విషయంపై మస్క్ సోదరి టోస్కా మస్క్‌ను ఇంటర్వ్యూలో అడిగారు. తను ప్యాషన్‌ఫ్లిక్స్ అనే స్ట్రీమింగ్ సర్వీస్‌కి వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.
"నేను ఎలన్ మస్క్ సోదరి అని తెలియగానే అవతలివారు ఇంకాస్త ఎక్కువ చెల్లించగలదని ఆశించేవారు. 5000 డాలర్లు చెల్లించే ప్రదేశానికి 25000 చెల్లించమనేవారు. నా అవసరాలన్నింటికి మస్క్ సహాయం చేస్తాడని వారు బహుశా అనుకుంటూ ఉండవచ్చు. ఇది కరెక్ట్ కాదు" అని తెలిపింది.
233 బిలియన్ డాలర్ల సంపదతో ఇటీవలే ప్రపంచ అపర కుబేరుడి స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నాడు. ఈ జాబితాలో విలాసవస్తువుల తయారీ దిగ్గజ సంస్థ LVHM ఓనర్ బెర్నాల్డ్ అర్నాల్ట్ ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. ఈ జాబితాలో ఒరాకిల్‌కి చెందిన లారీ ఎల్లీసన్, అమెజాన్ ఈ-కామర్స్ అధినేత జెఫ్ బెజోస్, ఇన్వెస్టింగ్ గురు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్, గూగుల్ సహవ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, మైక్రోసాఫ్ట్ సహ ఓనర్ స్టీవ్ బాల్మర్, మెక్సికో టెలికాం కంపెనీ ఓనర్ కార్లొస్ స్లిమ్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకన్‌బర్గ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు.
టెస్లాతో ఎలన్ మస్క్ ప్రయాణం..
మస్క్‌కి ఈ స్థాయిలో సంపద పెరగడానికి తన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ అయిన టెస్లా మోటార్స్ షేర్ల విలువ ఎగబాకడమే కారణం. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఎలన్ మస్క్ టెస్లా వ్యవస్థాపకుడు కాదు. 2003 లో టెస్లా ఏర్పాటైన సమయంలో తొలి ఇన్వెస్టర్లలో అతను ఒకడు మాత్రమే. తర్వాత జరిగిన సంఘనల తర్వాత 2004లో కంపెనీలో USD 6.5 మిలియన్లు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీలో అతిపెద్ద పెట్టుబడిదారుడయ్యాడు. 2008లో కంపెనీకి సీఈవో మరియు ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్ అయ్యాడు.
2022లో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌పాం ట్విట్టర్‌ను వివాదాల మధ్య USD 44 బిలియన్లకు సొంతం చేసుకున్నాడు. ఈ డీల్ కోసం టెస్లాలోని తన వాటాలను అమ్మాల్సివచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com