Elon Musk: అకౌంట్ నంబర్ తప్పు కొట్టిన ఎలాన్ మస్క్.

తప్పుడు సమాచారం వ్యాప్తి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బ్రెజిల్ కోర్టు విధించిన జరిమానాను చెల్లించారు. అయితే X(ఎక్స్) పొరపాటుగా 5.2 మిలియన్ల (రూ.43 కోట్లు) డబ్బును తప్పుడు ఖాతాలోకి బదిలీ చేసింది.
అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో ఎలాన్ మస్క్‌కు బ్రెజిల్ కోర్టు భారీగా జరిమానా విధించింది. 5.2 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.44 కోట్ల ఫైన్ వేసింది. ఆ మొత్తాన్ని బ్రెజిల్ కోర్టు ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్.. రూ.44 కోట్లను బ్రెజిల్ కోర్టు బ్యాంక్ అకౌంట్‌లో జమచేస్తుండగా చిన్న తప్పిదం జరిగింది. బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేసే సమయంలో తప్పు జరిగింది. కోర్టు ఖాతాలోకి కాకుండా మరో ఖాతాలోకి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే ఈ విషయాన్ని బ్రెజిల్ కోర్టు జడ్జి మోరేస్ తెలిపారు.
అసస్య సమాచార వ్యాప్తికి సంబంధించిన కేసులో ట్విటర్‌పై పడిన జరిమానా మొత్తాన్ని ఆ సంస్థ చెల్లించిందని.. అయితే అది కోర్టు ఆర్డర్‌పై ఉన్న ఖాతాకు కాకుండా మరొక ఖాతాకు డబ్బు చెల్లించిందని చెప్పారు. ఈ విషయాన్ని తాము గుర్తించామని.. వెంటనే ఆ మొత్తాన్ని కోర్టు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు కోర్టు స్పష్టం చేసింది. ఇక బ్రెజిల్‌లో ట్విటర్‌పై విధించిన నిషేధం.. ఇంకా కొనసాగుతూనే ఉంది.
అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పలు ట్విటర్ ఖాతాలను తొలగించాలని గతంలో బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డె మోరాసే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆ దేశంలో ట్విటర్ సేవలు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే బ్రెజిల్ కోర్టు ఆదేశాలపై ఎలాన్‌మస్క్ స్పందించారు. వాక్‌స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది అని.. ప్రజా ఆమోదంతో ఎన్నిక కాని జడ్జి.. ఈ పునాదిని రాజకీయ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని.. ఆయన ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల బ్రెజిల్ నుంచి ట్విటర్‌కు వస్తున్న ఆదాయం మొత్తం పోతోందని.. ఫలితంగా అక్కడ తమ కార్యకలాపాలను మూసివేయాల్సి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. అయినా తాము బాధపడటం లేదని.. లాభాల కంటే సిద్ధాంతాలే ముఖ్యమని తేల్చి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com