Elon Musk: మస్క్ కు షాక్ ఇచ్చిన టెస్లా

Elon Musk: మస్క్ కు షాక్ ఇచ్చిన టెస్లా
ఒక్కరోజే రూ.1.64 లక్షల కోట్లు నష్టం

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కు భారీ షాక్ తగిలింది. టెస్లా షేర్ల భారీ పతనంతో మస్క్ ఒక్కరోజే ఏకంగా 20.3 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.64లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

అయినా ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ అగ్రస్థానంలోనే ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించాలని యోచిస్తున్నట్లు టెస్లా ప్రకటించింది. వడ్డీ రేట్లు ఇలాగే కొనసాగితే విద్యుత్ వాహనాల ధరలను మరింత తగ్గించక తప్పదని మస్క్ వెల్లడించారు. దీంతో గురువారం నాటి అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ లో ఈ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. షేరు ధర ఏకంగా 9.7శాతం కుంగింది. ఈ క్రమంలో ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం మస్క్ మొత్తం నికర సంపద 234.4 బిలియన్ డాలర్లకు తగ్గింది.

52 ఏళ్ల మస్క్ మూడు కంపెనీల నుంచి అత్యధికంగా సంపాదిస్తున్నాడు. వీటిలో అత్యంత ప్రముఖమైనది EV కార్ల తయారీ కంపెనీ టెస్లా. ఇదొక్కటే కాకుండా స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ , ట్విట్టర్‌ నుంచి కూడా మస్క్ కు ఆదాయం లభిస్తుంది. మరోవైపు మస్క్ పోటీ దారు అయిన 74 ఏళ్ల ఆర్నాల్ట్ నికర విలువ ఈ ఏడాది 39 బిలియన్ డాలర్లు పెరిగి 201.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో, వరల్డ్‌ రిచెస్ట్‌ పర్సన్స్‌ లిస్ట్‌లోని నంబర్‌ 1, నంబర్‌ 2 ఆస్తుల మధ్య గ్యాప్‌ చాలా వేగంగా తగ్గింది.

ఒక్క ఎలాన్ మస్క్‌ మాత్రమే కాదు, గురువారం మరికొందరు బిలియనీర్ల ఆస్తుల విలువలోనూ కోత పడింది. జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, స్టీవ్ బాల్మెర్, మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ నెట్‌వర్త్‌ కూడా తగ్గింది.

Tags

Read MoreRead Less
Next Story