Emirates : విమానంలో ప్రసవం

ఓ ప్రయాణికురాలు విమానంలో ప్రసవించింది. టోక్యోలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ కు వెళ్తోన్న ఎమిరేట్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. తల్లి బిడ్డలు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 19న ఎమిరేట్స్ విమానంలో ఓ మహిళ ప్రసవ వేదనకు గురైంది. సిబ్బంది సహాయంతో బిడ్డకు జన్మనిచ్చింది. 12 గంటల ఓవర్ నైట్ ఫ్లైట్ EK 319లో ఈ ఘటన జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ షెడ్యూట్ ప్రకారమే ఫ్లైట్ ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు.
ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు ఎమిరేట్స్ అధికారులు. గర్భం దాల్చిన ఒక నిర్ధిష్ట సమయం వరకు మహిళలను అనుమించినప్పటికీ, అనుకోని కారణాల వలన విమానాల్లో ప్రసవించడం సర్వసాధారణమని అన్నారు. ఎమిరెట్స్ పాలసీ ప్రకారం, ప్రయాణీకులకు ఏవిధమైన వైద్యపరమైన సమస్యలు లేదా ఆందోళనలు లేని పక్షంలో గర్భం దాల్చిన ఏడవ నెల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com