Chinese New Year: చైనాలో ఉత్సాహంగా లాంతర్ల పండుగ

చైనా నూతన సంవత్సర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన లాంతర్ల ప్రదర్శనతో రాజధాని బీజింగ్ ఇంద్రధనస్సు తరహా ధగధగలాడింది. వెయ్యి రకాల భారీ సెట్టింగ్‌లు అబ్బురపరిచే కాంతులు కళ్లు మిరుమిట్లు గొలిపే ఆకారాల నడుమ చైనీయులు లాంతర్ల పండగను జరుపుకున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ తమ భవిష్యత్తు బంగారుమయంగా మారాలని కోరుకున్నారు.
చైనా నూతన ఏడాది ముంగింపు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన లాంతర్ షో కాంతుల్లో రాజధాని బీజింగ్ వెలిగిపోయంది. వెన్యుహె పార్క్‌లో వెయ్యికి పైగా రంగురంగుల విద్యుత్ బల్బులతో తయారు చేసిన ఆకారాలు వీక్షకులకు కనులవిందు చేశాయి. 4 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ప్రాంతాన్ని....ఆరు భాగాలుగా విభజించి చైనా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అందులో 12 రాశులచిహ్నాలు, చైనీయులు సంప్రదాయంలో భాగమైన భారీ డ్రాగన్ రూపాలు, అంతరిక్షయానానికి చెందిన తైకోనాట్ల ఆకారాలతో లాంతర్లను తీర్చిదిద్దారు.
చైనా పురాతనకాలంలో పిల్లలు పేపర్లతో తయారుచేసిన లాంతర్లను రాత్రుల్లు తమ వెంట తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించుకునే వారు. ఆధునిక కాలంలో అదే రూపాంతరం చెంది...లాంతర్ల పండుగగా మారినట్లు తెలుస్తోంది. ఈ పండగను జరుపుకోవడం ద్వారా రాబోయే సంవత్సరం తమకు బంగారు భవిష్యత్తును కలగజేస్తుందని చైనీయులు విశ్వసిస్తారు. లాంతర్ల పండగను లూనార్ నెలలోని 15 రోజున జరుపుకొంటారు. ఇది నూతన సంవత్సర ముగింపు వేడుకలను సూచిస్తుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com