Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు ..

ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్‌తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. ఇంతకుముందు ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ఈ బిల్లుపై బుధవారం అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు. సైనిక సాయంలో భాగంగా మరి కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపిస్తామని చెప్పారు. అంతకుముందు ‘‘రష్యా నుంచి బాంబుల దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు ఇది చాలా అత్యవసరమైన బిల్లు. ఇరాన్ నుంచి దాడులు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కి, ఇండో పసిఫిక్ స్థిరత్వానికి కూడా ఈ బిల్లు కీలకమే’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ 95.3 బిలియన్ డాలర్ల విలువైన బిల్లులో 60.8 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్‌కు, 26.4 బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్‌కు, 8.1 బిలియన్ డాలర్లు తైవాన్, ఇండో పసిఫిక్ ప్రాంతానికి అందనున్నాయి. తైవాన్‌కు సైనిక ప్యాకేజీ ప్రకటించడంపై చైనా మండిపడింది. ఇది అమెరికా అనుసరిస్తున్న ఒకే చైనా విధానానికి విరుద్ధమని పేర్కొంది.
అమెరికా అధికారికంగానే కాదు రహస్యంగానూ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. నెల రోజుల క్రితం కొన్ని దీర్ఘశ్రేణి క్షిపణులను పంపింది. తాజాగా రష్యాపై వాటిని వినియోగించడం కీవ్ ప్రారంభించింది. ఈ క్షిపణులతో ఉక్రెయిన్ సామర్థ్యం రెట్టింపైంది. రష్యా ఆక్రమిత ప్రాంతాలపై తొలిసారిగా ఉక్రెయిన్ సుదూర బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. బుధవారం నాడు అర్థరాత్రి రష్యా ఆర్మీ ఎయిర్‌స్ట్రిప్, క్రిమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగాయని పేర్కొన్నాయి. అమెరికా రహస్యంగా ఈ క్షిపణులను ఉక్రెయిన్‌కు పంపింది అనే విషయాన్ని అమెరికాకు చెందిన ఓ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదే కాకుండా.. ఉక్రెయిన్ రష్యాలోని లిపెట్స్క్ ప్రాంతంలో ఉన్న పెద్ద ఉక్కు ఫ్యాక్టరీపై డ్రోన్ దాడి చేసి ధ్వంసం చేసిందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్‌కు ఆయుధాలను యూఎస్ అందించింది. ఈ క్షిపణులు రష్యాలోని జనాభా ఉన్న ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి. అలాగే, NATO కూటమితో ప్రత్యక్ష సంఘర్షణను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com