Pakistan : మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి

భారత వ్యతిరేక ప్రసంగాలతో యువతను వెర్రెక్కించే లష్కరే తోయిబా మాజీ కమాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. భారత వ్యతిరేక ప్రసంగాలకు పేరుగాంచిన అక్రమ్ ఖాన్‌ను పాకిస్థాన్‌లో ఆగంతకులు కాల్చి చంపారు. లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను పాకిస్థాన్‌లో గురువారం కాల్చి చంపినట్లు పాక్ పోలీసు వర్గాలు తెలిపాయి. అక్రమ్ గాజీ అని కూడా పిలిచే అక్రమ్ ఖాన్‌ను ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
2018వ సంవత్సరం నుంచి 2020 వరకు లష్కరే తోయిబా రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించిన గాజీ పాకిస్థాన్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. ఈయన తీవ్రవాద గ్రూపునకు చెందిన ప్రముఖ వ్యక్తి. అక్రమ్ ఖాన్ చాలా కాలంగా తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అక్రమ్ తీవ్రవాద కారణాల పట్ల సానుభూతిగల వ్యక్తులను గుర్తించి, వారిని ఉగ్రవాద సంస్థలో రిక్రూట్ చేశారు.
2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ఈ ఏడాది అక్టోబర్ పాకిస్థాన్‌లో కాల్చివేతకు గురయ్యాడు. పాక్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన షాహిద్.. భారత మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిం ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లోని అల్ ఖుదూస్ మసీదు లోపల హత్యకు గురయ్యాడు. కోట్లీ నుంచి ప్రార్థనల కోసం వచ్చిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com