బ్రతికుండగానే వేల కోట్ల ఆస్తిని..

బ్రతికుండగానే వేల కోట్ల ఆస్తిని..
జీవించి ఉండగానే ఇవ్వడంలోని ఆనందం గురించి తెలుసుకోండి అని అంటున్నారు.

వేల కోట్ల డబ్బు సంపాదించిన ఆనందం కంటే ఆ సంపాదించిన మొత్తం దానం చేసినప్పుడు కలిగిన సంతృప్తి వెలకట్టలేనిది అని అంటున్నారు ఛార్ట్స్ ఛక్ ఫినీ. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన విమానాశ్రయ రిటైలర్ డ్యూటీ ఫ్రీ షాపర్స్ సహ వ్యవస్థాపకులు ఛక్ ఫినీ. 1960లో రాబర్ట్ మిల్లర్ తో కలిసి వ్యాపారం ప్రారంభించారు. సంపాదన బాగానే ఉన్నా మితంగా ఖర్చుపెట్టేవారు. వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరింపజేసి బిలియన్ల సంపదన కూడ బెట్టారు. పుడుతూ ఏమీ తీసుకురాలేదు.. వెళ్లేటప్పుడు మాత్రం ఇవన్నీ ఎందుకు.. దేని మీద వ్యామోహం పెంచుకోకూడదు అని తన సంపాదన మొత్తం దానం చేయ సంకల్పించారు.

తాను, తన భార్య బ్రతకడానికి కొంత మొత్తం రూ.14 కోట్లను ఉంచుకుని మిగిలిన 58 వేల కోట్లను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. నా ప్రయాణంలో నేను చాలా నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో మాతో చేరిన అందరికీ నా కృతజ్ఞతలు.. జీవించి ఉండగానే ఇవ్వడంలోని ఆనందం గురించి తెలుసుకోండి అని అంటున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా, ఫీనీ తన స్వచ్ఛంద సంస్థ 'అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్' ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, విశ్వవిద్యాలయాలకు 8 బిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇచ్చారు. చాలా మంది ధనవంతులైన పరోపకారులు తమ విరాళాలను ప్రకటించేటప్పుడు ప్రచారానికి పెద్ద పీట వేస్తారు. కానీ ఫీనీ తన దాన ధర్మాలను రహస్యంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేసేవారు. అందుకే ఫోర్బ్స్ అతన్ని జేమ్స్ బాండ్ ఆఫ్ ఫిలాంత్రోపీ అని పిలిచింది.

2012లో తన పదవీవిరమణ సమయాని కల్లా యావదాస్థిని దానం చేస్తానని ప్రకటించారు. ఈనెల 14న ఫీనీ ప్రయాణం ముగిసింది. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ల దాతృత్వానికి ఫినీ స్ఫూర్తిగా నిలుస్తారు. మేము సంపాదించిన అపార సంపదను దానం చేసేందుకు చక్ మాకు ఒక దారిని చూపించాడు.. ఆస్తి సంపాదించడం కంటే దానం చేయడంలోనే ఆనందం ఉంటుందని ఆయన్ని చూసే నేర్చుకున్నామంటారు బిల్ గేట్స్. ఫినీ ఇప్పుడు తన భార్యతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో సాధారణ జీవితాన్ని గడుపుతూ ప్రశాంతంగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story