అంతర్జాతీయం

అలెర్జీ ఎఫెక్ట్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంతో..

దీంతో బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ అలెర్జీలతో బాధపడుతున్న వారు టీకాలు వేయించుకోవద్దని బుధవారం ఒక హెచ్చరికను జారీ..

అలెర్జీ ఎఫెక్ట్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంతో..
X

కొన్ని మందులు, కొన్ని ఆహార పదార్దాలు, అలాగే కొన్ని వ్యాక్సిన్లు అలెర్జీ ఉన్న వారికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడతాయి. తాజాగా కొవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ తీసుకున్న వారిని కూడా అలెర్జీ ఇబ్బంది పెట్టింది. దీంతో బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ అలెర్జీలతో బాధపడుతున్న వారు టీకాలు వేయించుకోవద్దని బుధవారం ఒక హెచ్చరికను జారీ చేసింది.

ఇద్దరు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) కార్మికులకు ఇంజెక్ట్ చేసిన కొద్దిసేపటికే "అనాఫిలాక్టోయిడ్ రియాక్షన్" లక్షణాలు కనిపించడంతో ఈ హెచ్చరిక జారీ చేశారు. అయితే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న వారు అనంతరం కోలుకుంటున్నట్లు చెబుతున్నారు.

దీంతో టీకాను స్వీకరించే రోగులందరికీ అలెర్జీల చరిత్ర ఉందా లేదా అని అడిగి మరీ వ్యాక్సిన్ ఇస్తారని NHS ఇంగ్లాండ్ తెలిపింది. "కొత్త వ్యాక్సిన్లతో అలెర్జీ ప్రతిచర్యల చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు ప్రతికూలంగా స్పందించిన తరువాత, ఈ టీకాను స్వీకరించవద్దని MHRA ముందుజాగ్రత్త ప్రాతిపదికన సలహా ఇచ్చింది" అని వైద్య ప్రొఫెసర్ స్టీఫెన్ పోవిస్ చెప్పారు.

అలెర్జీలో భాగంగా చర్మం దద్దుర్లు, ఊపిరి ఆడకపోవడం, కొన్నిసార్లు రక్తపోటు తగ్గడం వంటివి జరుగుతాయని తెలిపారు. "ముందు జాగ్రత్త చర్యగా ప్రతి కేసును, దాని కారణాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్‌తో సహా ఏదైనా కొత్త వ్యాక్సిన్‌ వచ్చినప్పుడు ఇలాంటి అరుదైన సంఘటనలు ఎదురవుతుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూకే లో V- డే లేదా వ్యాక్సిన్ డేగా గుర్తించబడిన రోజు మంగళవారం కోవిడ్‌కు టీకాలు అనేక వేల మందికి వేశారు. భారతీయ సంతతికి చెందిన భార్యా భర్తలు.. హరి శుక్లా ( 87), అతని భార్య రంజన్ (83), ప్రాణాంతక వైరస్ వలన మరణించే ప్రమాదం ఉన్నవారిగా గుర్తించి వారికి టీకా ఇచ్చారు. టీకా కార్యక్రమాన్ని 50 హాస్పిటల్ హబ్‌లలో వచ్చే వారం నుండి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఎన్‌హెచ్‌ఎస్ ప్రకటించింది. 80 ఏళ్లు పైబడిన వారిని మొదట ఈ టీకాను అందిస్తారు.

మిలియన్ కంటే ఎక్కువ మంది బెల్జియం ప్రజలకు టీకా రవాణా చేయబడుతుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి, మొత్తం 5 మిలియన్ మోతాదులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది - పూర్తి రక్షణ కోసం రెండు మోతాదుల వ్యాక్సిన్ అవసరం కాబట్టి ఆ మేరకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే యుకెలోని చాలా ప్రాంతాల్లో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ల రేటు ఇంకా ఎక్కువగా ఉన్నందున, ఇప్పటికీ అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయని ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ అన్నారు.

"అయినప్పటికీ, మనకు వ్యాక్సిన్ ఉన్నందున, టీకాను ఎంత వేగంగా తయారు చేయగలుగుతున్నామో, అంత త్వరగా మనం వ్యవస్థను పూర్తిగా పునర్ నిర్మించే స్థితికి చేరుకుంటాము" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES