Iran: ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరి

Iran: ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరి
వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం

మహిళలు హిజాబ్‌ ధరించకపోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఇరాన్‌ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు హిజాబ్‌ ధరించకపోయినా, అలాంటి మహిళలకు మద్దతు తెలిపినా కఠిన శిక్షలు విధించాలని నిర్ణయించింది. గతంలో ఈ డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిందుకు అరెస్టయిన మాషా ఆమిని అనే యువతి ప్రాణాలు కోల్పోయి ఏడాది పూర్తయిన సందర్భంలోనే పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించడం గమనార్హం. హిజాబ్‌ను ధరించని మహిళలను ఉద్యోగంలో పెట్టుకున్న వ్యాపారవేత్తలకు భారీగా జరిమానా విధిస్తారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. పార్లమెంటులోని మొత్తం 290 మంది సభ్యులకుగానూ 152 మంది ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ బిల్లుకు మతపెద్దల సంస్థ అయిన గార్డియన్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలపాల్సి ఉంది.

ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు కచ్చితంగా హిజాబ్‌ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. హిజాబ్‌ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, వారికి మద్దతు తెలిపే వారిపై భారీ శిక్షలు విధించేందుకు సిద్ధమైంది. బిల్లును ఇరాన్‌ పార్లమెంట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం..హిజాబ్‌ తప్పనిసరిగా ధరించితీరాల్సిందే. హిజాబ్ ధరించకుండా విధులు నిర్వహించేందుకు అనుమతించే వ్యాపార సంస్థలతో పాటు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే కార్యకర్తలపై కూడా శిక్షలు విధించనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కనీసం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.


కాగా ఇస్లాం దేశమైన ఇరాన్ లో మ‌హిళ‌ల‌పై ఆంక్షలు చాలా ఎక్కువగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా వారి ధరించే దుస్తుల విషయంలో‌. హిజాబ్ తప్పనిసరి. ఇది కచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ ఆంక్షలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఇరాన్ లో మహిళు డ్రెస్ కోడ్‌పై మోర‌ల్ పోలీసుల నిఘా ఉంటుంది. దీన్ని బట్టి ఊహించుకోవచ్చు. హిజాబ్ స‌రిగా ధ‌రించ‌కపోతే పోలీసులు ఏదారుణానికైనా తెగిస్తారు అనేదినాకి నిదర్శనం మహ్సా అమినీ అనే మహిళ మరణం.

గతేడాది సెప్టెంబ‌ర్ 20వ తేదీన మోర‌ల్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె హిజాబ్ ను సరిగా ధరించలేదనే కారణంతో 22 ఏళ్ల అమీనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత మూడు రోజులకు ఆమె పోలీసు క‌స్టడీలో చ‌నిపోయింది. 2022 సెప్టెంబర్‌ 16న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజ‌లు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిర‌స‌న ప్రద‌ర్శన‌లు చేప‌ట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 నెల‌లుగా హిజాబ్, మోర‌ల్ పోలీసింగ్‌ వ్యతిరేక నినాదాలు, నిర‌స‌న‌ల‌తో ఇరాన్ అట్టుడికింది. ఈ నిర‌స‌నల్లో సుమారు 500 మందికిపైగా పౌరులు చనిపోయారు. వేలాదిమందిని నిర్భంధించారు.

Tags

Read MoreRead Less
Next Story