Face Book, Instagram : ట్రంప్ పై నిషేదం ఎత్తివేత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్దరించింది మెటా. కాపిటల్ అల్లర్ల నేపథ్యంలో విధించిన రెండేళ్ల సస్పెన్షన్ ను ఎత్తేసింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మద్దతు దారులు 2021 జనవరి6న క్యాపిటల్ హిల్స్ పై దాడికి పాల్పడ్డారు. క్యాపిటల్ లో హింసాత్మక చర్యలను పాల్పడిన వ్యక్తులను ప్రశంసించినందుకు ట్రంప్ ను ఫేస్ బుక్ నుంచి సస్పెండ్ చేసింది.
ట్రంప్ భవిష్యత్తులో కంటెంట్ పాలసీని ఉల్లంగిస్తే చర్యలు తప్పవని మెటా స్పష్టం చేసింది. పోస్టులో కంటెంట్ తీవ్రతను బట్టి నెల నుండి రెండు సంవత్సరాల మధ్య ఎకౌంట్ ను సస్పెండ్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ 2016, 2020లో ట్రంప్ ప్రచారానికి కావలసిన నిధులను సేకరించేందుకు ఫ్లాట్ ఫాంగా ఉపయోగపడింది.
ఎలన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ట్విట్టర్ లో కూడా ట్రంప్ ఎకౌంట్ ను పునురుద్ధరించారు. ట్రంప్ ఇంకా ట్వీట్ చేయలేదు. ట్విట్టర్ నుంచి బ్లాక్ చేసిన తర్వాత ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియాపై ట్రంప్ ఆదారపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com