Biden Vs Trump: వాడైన మాటలతో దూసుకుపోయిన ట్రంప్‌ దూకుడు.. తడబడిపోయిన బైడెన్‌

Biden Vs Trump:  వాడైన మాటలతో దూసుకుపోయిన ట్రంప్‌ దూకుడు.. తడబడిపోయిన బైడెన్‌
ఆసక్తికరంగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ

అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 2020 అధ్యక్ష ఎన్నికల గందరగోళం తర్వాత వీరిద్దరూ తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. అట్లాంటాలోని సీఎన్‌ఎన్‌ ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

చర్చలో బైడెన్‌, ట్రంప్‌ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఒకానొక దశలో సంయమనం కోల్పోయిన నేతలు వ్యక్తిగత విమర్శలకూ దిగారు. మాజీ అధ్యక్షుడు దూకుడు ప్రదర్శించగా.. బైడెన్‌ కొన్నిచోట్ల తడబడ్డట్లు కనిపించారు. బైడెన్‌ను ట్రంప్‌ ఫెయిల్యూర్‌గా అభివర్ణించారు. దీనికి ప్రతిగా ట్రంప్‌ను బైడెన్‌ దోషి అంటూ ఆరోపణలు గుప్పించారు. చర్చలో నిర్వహకులు తప్ప మరెవరూ లేకపోవడం గమనార్హం. పైగా ఈసారి ఒకరు మాట్లాడుతుండగా.. మరొకరి మైక్‌లను కట్‌ చేశారు.

చర్చలో ట్రంప్‌ పైచేయి సాధించినట్లు సీఎన్‌ఎన్‌ పోల్‌లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సైతం బైడెన్‌ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. కానీ, చివరకు హుందాగా, దీటుగా ముగించారని పేర్కొన్నారు. మొత్తం చర్చలో ట్రంప్‌ 23 నిమిషాల ఆరు సెకన్లు మాట్లాడగా.. బైడెన్‌ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు.

ట్రంప్ కేవలం సంపన్నులకు అనుకూలంగా ఆర్థిక విధానాలనున అనుసరించారని బైడెన్ ఆరోపించగారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిరుద్యోగం 15 శాతనికి చేరిందని ఆయన అన్నారు. దీనికి ట్రంప్ బదులిస్తూ బైడెన్ హయాంలో కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ద్రవ్యోల్భనం, పన్నుకోతల వల్ల ఎప్పుడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అన్నారు.

విదేశాంగ విధానంపై ఇరువురు మధ్య తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దారుణంగా సాగిందని ట్రంప్ విమర్శించారు. తన హయాంలో చాలా గౌరవప్రదంగా సైనికులు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ట్రంప్ హయాంలోనే తాలిబాన్లు అమాయకపు ఆఫ్ఘాన్నలను చంపారని, చివరకు అక్కడ మరణించిన అమెరికా సైనికులను కూడా ట్రంప్ తిట్టారని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్‌కి ట్రంప్ పూర్తి స్వేచ్ఛనిచ్చారని, రష్యా ప్రతిదాడిని సమర్థిస్తున్నాడని ఆరోపించారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నానే ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేదని బైడెన్ అన్నారు. దీనిని ఉద్దేశిస్తూ, దేశ దక్షిణ సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడటంలో బైడెన్ విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు.

గర్భవిచ్ఛత్తి నిషేధాన్ని బైడెన్ తప్పుబట్టారు. దీనిని వైద్యులు, మహిళలకే వదిలేయాని, రాజకీయ నాయకులు చర్చించే అంశం కాదని బైడెన్ చెప్పారు. అయితే దీనిపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇద్దరూ కూడా ఇజ్రాయిల్‌కి మద్దతుగా నిలిచారు. యుద్ధం బాధ్యత మొత్తం హమాస్‌దే అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Tags

Next Story