Japan: మాఫియా చేతికి అణుబాంబు తయారీ సామగ్రి

సాధారణంగా మాఫియా డాన్లు మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా చేస్తుంటారు. కానీ జపాన్‌కు చెందిన ఓ మాఫియాడాన్ మాత్రం అణ్వాయుధాల తయారీకి వాడే పదార్థాలను ఇరాన్‌కు సరఫరా చేసేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ జపాన్‌కు చెందిన టకేషి ఎబిసావపై నేరాభియోగాలను నమోదు చేసింది.
మయన్మార్ కేంద్రంగా అణ్వాయుధాల్లో వాడే కీలక పదార్థాల అక్రమ రవాణా కొనసాగుతోంది. ఓ కేసు దర్యాప్తు సందర్భంగా అమెరికా ఈ విషయాన్ని పసిగట్టింది. జపాన్‌కు చెందిన ఓ మాఫియా డాన్ అణుబాంబుకు సంబంధించిన కీలక పదార్థాలను అక్రమంగా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అతనిపై నేరాభియోగాలు నమోదు చేసింది. జపాన్‌లో వ్యవస్థీకృత నేరాల సిండికేట్‌కు చెందిన టకేషి ఎబిసావను 2022లో డ్రగ్స్, ఆయుధ విక్రయాలకు పాల్పడ్డారంటూ అరెస్టు చేశారు. అతని గ్రూప్ శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్, అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు కీలక విషయాలను కనుగొన్నారు. ఇరాన్‌కు చెందిన ఓ ఆర్మీ జనరల్‌తో అణు పదార్థాల డీల్ నడిపినట్లు గుర్తించారు. ఇరాన్ నుంచి ఆయుధాలకు బదులు అణు సామగ్రి ఇచ్చేలా ఒప్పందం చేసుకొన్నట్లు గుర్తించారు.
2020లో టకేషి అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్ఫోర్సెమెంట్ అడ్మినిస్ట్రేషన్ అండర్ కవర్ ఏజెంట్‌ను ఆయుధాల అక్రమ రవాణాదారుగా భావించి అణుపదార్థాల అక్రమ రవాణా వివరాలు వెల్లడించాడు. కొనుగోలుదార్లు ఎవరైనా ఉంటే పరిచయం చేయమని ఏజెంట్‌ను కోరినట్లు అమెరికా అధికారులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. కొన్ని అణుపదార్థాల ఫొటోలను రేడియేషన్ కొలతలు పంపినట్లు తెలిపింది. అమెరికా ఏజెంట్ తనకు తెలిసిన ఓ ఇరానియన్‌కు విక్రయించేందుకు సాయం చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు.
2021లో టకేషి మరోసారి అమెరికా ఏజెంట్‌ను థాయ్‌లాండ్‌లో సంప్రదించాడు. మయన్మార్ నుంచి తెప్పించిన అణు పదార్థాల శాంపిల్స్‌ను...చూపించాడు. వాటిని స్వాధీనం చేసుకొని అమెరికా లాబొరేటరీలో పరీక్షించగా యురేనియం, థోరియం, ప్లుటోనియం అని తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com