ఇదేం మాయ.. ఆన్‌లైన్‌లో ఫ్రిజ్ ఆర్డర్.. తెరిచి చూస్తే రూ.96 లక్షలు..

లక్ష్మీ దేవీ ఏంటి ఇలా ఫ్రిజ్ రూపంలో ఇంటికొచ్చిందని ఆశ్చర్యపోయాడు.. అందులో ఉన్న నోట్ల కట్టలను చూసి అవాక్కయ్యాడు. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికి చెందిన వ్యక్తి ఆగష్టు 6 న డెలివరీ చేసిన ఫ్రిజ్‌ని శుభ్రం చేస్తున్నప్పుడు ఈ నగదు దొరికిందని పోలీసులు చెప్పారు. డబ్బు ప్లాస్టిక్ షీట్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్ అడుగుభాగంలో టేప్‌తో అంటించారు. వాటిని చూసి వెంటనే పోలీసులు సమాచారం అందించాడు ఫ్రిజ్ కొనుగోలుదారుడు. కొరియా టైమ్స్ నివేదిక ప్రకారం, బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నందున దేశ ప్రజలు నగదును ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఉండవచ్చని పేర్కొంది. ఇక ఇక్కడి చట్టాల ప్రకారం
చట్టాల ప్రకారం ఈ డబ్బు ఎవరిదనేది గుర్తించని పక్షంలో దాన్ని గుర్తించిన వ్యక్తికే అది చెందుతుంది. అదే జరిగితే రిఫ్రిజిరేటర్ యజమాని మొత్తం నగదులో 22 శాతం పన్నులు చెల్లించగా మిగిలిన మొత్తం సొంతం చేసుకోవచ్చు. డబ్బు వేరొకరిదని తేలినా రిఫ్రిజిరేటర్ ఓనర్‌కు కొంతమొత్తం పరిహారం లభిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com