లేడీ జైలర్ యమ డేంజర్.. మగ ఖైదీలతో కామక్రీడలు..

లేడీ జైలర్ యమ డేంజర్.. మగ ఖైదీలతో కామక్రీడలు..
11 మంది ఖైదీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్న విషయం వెలుగు చూడడంతో మహిళా జైలు అధికారి కటకటాల పాలయ్యారు.

11 మంది ఖైదీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్న విషయం వెలుగు చూడడంతో మహిళా జైలు అధికారి కటకటాల పాలయ్యారు. కాలిఫోర్నియాకు చెందిన టీనా గోన్‌జలెస్‌ (26). తన కామవాంఛలను జైలులో ఉన్న ఖైదీల ద్వారా తీర్చుకునేది. ఆమె మాజీ బాస్, అసిస్టెంట్ షెరీఫ్ స్టీవ్ మక్కోమాస్ తన 26 సంవత్సరాల ఉద్యోగంలో ఇది "చాలా అసహ్యకరమైన విషయం" అని కోర్టుకు చెప్పారు.

"ఆమె అలా చేయడం వలన సహోద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడేసింది" అని మెక్కోమాస్ చెప్పారు. "కానీ ఆమెలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించట్లేదు. ఆమె నిరంతరం ఖైదీలను పిలిచి వారితో అసభ్యకరమైన లైంగిక సంభాషణలు చేస్తుంది. ఆమె చేసిన నేరాల గురించి ప్రగల్భాలు పలుకుతుంది, "అని అతను కోర్టుకు చెప్పాడు. అలాగే ఆమె ఖైదీలకు డ్రగ్స్, ఆల్కహాల్ సరఫరా చేసేది.

ఆమె మాజీ బాస్ ఆమెకు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించాలని పిలుపునిచ్చారు. నిందితురాలి తరపున కౌన్సెలర్‌ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్‌జలెస్‌ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించమని కోర్టు వారిని వేడుకున్నాడు.

న్యాయమూర్తి మైఖేల్ ఇడియార్ట్ ఆమె అభ్యర్ధనను మన్నించి, ఇంతకు ముందు ఆమె ఏ విధమైన నేర చరిత్ర లేకపోవంతో శిక్షా కాలాన్ని తగ్గించారు. రెండు సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్ష విధించారు. ఆ రెండు సంవత్సరాలు ఆమె చర్యలను గమనిస్తామని చెప్పారు.

"మీరు చేసిన పని చాలా అసభ్యకరమైనది. మీరు మీ వృత్తిని చేతులారా నాశనం చేసుకున్నారు" అని న్యాయమూర్తి ఇడియార్ట్ గొంజాలెజ్తో అన్నారు. ఒక ఆఫీసరుగా జైలు బాధ్యతలను నిర్వర్తించాల్సిన ఆమె అదే జైలుకు ఖైదీగా వెళ్లవలసిన దుస్థితి తెచ్చుకుంది.

Tags

Next Story