తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన నవజాత శిశువు..!

Fetus Found In New Borns Womb: ఇస్రాయిల్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో అద్బుతం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఒక నవజాత శిశువు గర్బందాల్చి ఉండటం చూసి అక్కడి డాక్టర్ లు విస్మయానికి లోనయ్యారు. అప్పుడే పుట్టిన ఈ నవజాత శిశువు కడుపులో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉండటం విద్యలు గమనించారు. మనిషి రూపం లోనే ఉన్న ఈ పిండాలలో గుండె ఎముకలు కూడా అభివృద్ధి చెందాయట. తరువాత సర్జరీ ద్వారా శిశువు లోపలున్న ఆ పిండాలని తొలగించి చిన్నారికి చికిత్స అందిస్తున్నరట వైద్యులు. ఇలాంటివి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని.. 10 లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది అని వైద్యులు సూసించారు.
ఇస్రాయిల్ లోని అశ్రోడ్ పట్టణం లో ఒక ప్రైవేటు హాస్పటల్ లో జులై మొదటి వారంలో ఆడ శిశువుకి జన్మనిచింది ఒక మహిళ. ప్రసవ సమయంలో ఆమెకి "అల్ట్రా సౌండ్" పరిక్షలు జరిపిన వైద్యులు గర్బంలో ఉన్న శిశువు పొట్ట సాదారణం కన్నా ఎక్కువ ఎత్తుగా ఉండటం గమనించారు. ప్రసవం తరువాత శిశువుకి కూడా అల్ట్రా సౌండ్ మరియు ఎక్స్రే పరిక్షలు నిర్వహించగా.. నవజాత శిశువులో కడుపులో ఒకటి కంటే ఎకువ పిండాలు ఉన్నాయి అని గుర్తించారు.
"ఓమర్ గ్లోబస్" నేత్రుత్వంలోని వైద్య బృందం సర్జరీ చేసి పలు పిండాలని బయటికి తీసారు. ఇలాంటివి జరగటానికి గల కారణాలన్నీ వివరిస్తూ.. తల్లి గర్బం లో కవలపిల్లలు అబివృద్ది చెందుతున్నపుడు కొంత వృద్ది చెందిన పిండం లోకి మరో పిండం ప్రవేశించడం జరుగుతుందని ఓమర్ గ్లోబస్ తెలిపారు. ఇలాటివి వైద్య శాస్త్రంలో చాలా అరుదుగా జరుగుతాయి అని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com